ఫన్నీ

ఇంగ్లండ్‌ అంటే ఆధునిక దేశం. ఫ్యాషన్లకి చిరునామా. కానీ అక్కడి అమ్మాయిలు

Published : 22 Jul 2017 01:31 IST

ఫన్నీ

* ఇంగ్లండ్‌ అంటే ఆధునిక దేశం. ఫ్యాషన్లకి చిరునామా. కానీ అక్కడి అమ్మాయిలు పెదాలకు లిప్‌స్టిక్‌ వేసుకోవడం కొన్నేళ్లపాటు నిషేధించారు. మంత్రవిద్యలు తెల్సినవాళ్లు మాత్రమే లిప్‌స్టిక్‌ పెట్టుకుంటారనే ఉద్దేశంతో అలా చేశారు. అయితే ఇది రెండువందల ఏళ్ల కిందటి మాట.

* కాల్పనిక కథలు, నవలు చదివిన వారికి మైండ్‌ రీడింగ్‌ స్కిల్స్‌ పెరుగుతాయట. ఇతరుల మనసుల్లో ఏముందో ఇట్టే కనిపెట్టేస్తారు.

* ఏబీసీడీఈ.. ఇదీ ఒక వ్యక్తి పేరేనంటే విచిత్రంగా ఉంది కదూ. 1990 నుంచి ఇప్పటివరకు అమెరికాలో 328 మందికి ఈ పేరు పెట్టుకున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని