మణికట్టు మెరవాలంటే?

లక్ష్యాన్ని అందుకోవడంలో ఆలస్యమైనా... ఆశించినది జరక్కపోయినా...

Published : 14 Oct 2017 01:53 IST

మణికట్టు మెరవాలంటే?

లక్ష్యాన్ని అందుకోవడంలో ఆలస్యమైనా... ఆశించినది జరక్కపోయినా... ‘టైమ్‌ బాగోలేదు... ఏం చేస్తాం!’ అనుకునే వారంతా నిన్నటి తరం. ‘మనకంటూ కాస్త సమయం ఉండాలి మిత్రమా!’ అంటూ దూసుకెళ్తున్నారు నేటి తరం. అందుకు మణికట్టుపై మెరిసే వాచ్‌లను పెట్టేస్తున్నారు. మరి, మీ సంగతేంటి? మీరూ ఈ వాచ్‌ ట్రెండ్‌ని ఫాలో అవుతున్నారా? ఇవిగోండి చిట్కాలు...
నలాగ్‌కొనాలా? డిజిటల్‌కొనాలా? లేదంటే కాస్త బడ్జెట్‌ఎక్కువైనా స్మార్ట్‌ వాచ్‌లకు వెళ్లాలా?... ఇదీ వాచ్‌ కొనాలనుకునే ముందు మదిలో మెదిలే ఆలోచన. ఇంతకు మునుపు ఏ వాచీ వాడాం అనేదాన్ని బట్టి కొత్తగా ఏది ధరిస్తే బాగుంటో నిర్ణయించుకోవాలి. గుండ్రం, చతుస్రాకారం, దీర్ఘచతురస్రాకారం, పాలిగన్‌... ఇలా వాచీల ఆకృతిని ఎంపిక చేసుకోవాలి. ఏదీ మన చేతికి నప్పుతుందో చెక్‌ చేసుకోవాలి. పట్టా (బెల్ట్‌) బాగుంటుందా? చైన్‌ సరిపోతుందా? ఇతర అలంకరణలు అవసరమా? చూసుకోవాలి.


క్రిస్టల్‌- వాచ్‌ఫేస్‌

ఇదే వాచ్‌లో అతి ముఖ్యమైనది. క్రిస్టల్‌, వాచ్‌ఫేస్‌, బాడీ అని రకరకాలుగా దీన్ని పిలుస్తారు. ఇందులో ముఖ్యంగా వాటర్‌ప్రూఫ్‌నకు ప్రాధాన్యం ఇవ్వాలి. గీతలు, మరకలు పడని గ్లాస్‌తో క్రిస్టల్‌ తయారవుతోంది. వీటిని ఎంపిక చేసుకోవాలి. స్పోర్ట్స్‌ వాచ్‌లో ఎక్కువగా ఈ ఫీచర్లు అందుబాటులో ఉంటాయి. అల్టీమీటర్‌, కాంపస్‌లూ అందుబాటులో ఉండే వాచీలు మార్కెట్లో లభిస్తున్నాయి.
ఏది ఎప్పుడు?
వెండి రంగు వాచీలు ఫార్మల్‌గా ఉంటాయి. బ్లాక్‌, గ్రే, సిల్వర్‌, బ్లూ రంగుల దుస్తులపైకి ఇవి నప్పుతాయి. బంగారు వర్ణం వాచీలు కాస్త రిచ్‌గా ఉంటాయి. దీన్ని అన్నిరకాల పార్టీలు, వేడుకలు, పండుగలకు ధరించవచ్చు. డిజిటల్‌ వాచీలను క్యాజువల్‌గా వాడవచ్చు. ఫ్రెండ్స్‌ను కలవాల్సినప్పుడు... సరదా పార్టీలకు, పర్యటనలకు వీటిని ఎంచుకోవచ్చు. వాచ్‌ని దుకాణానికి వెళ్లి మనకు ఏది నప్పుతుందో సరిచూసుకొని కొనుగోలు చేయడం ఉత్తమం.

స్మార్ట్‌గా ఒదిగిపోయి
వాచీలా మాత్రమే కాకుండా మరిన్ని స్మార్ట్‌ సేవల్ని అందిస్తూ స్పోర్టీవ్‌ లుక్‌తో ముందుకొస్తున్నాయి యాపిల్‌వాచీల్లాంటి ఖరీదైనవే కాదు. బడ్జెట్‌లో ఉన్నవీ చాలానే ఉన్నాయి. ఈ మధ్యే షామీ కంపెనీ ‘మి బ్యాండ్‌’కి అప్‌డేట్‌ వెర్షన్‌ని ‘మి బ్యాండ్‌ హెచ్‌ఆర్‌ఎక్స్‌’ పేరుతో మార్కెట్‌లోకి తెచ్చింది. హృతిక్‌ బ్యాండ్‌కి ప్రచారకర్తగా వ్యవహరిస్తున్నారు. ఇది కేవలం ఫిట్‌నెస్‌ బ్యాండ్‌ మాత్రమే కాదు. స్మార్ట్‌వాచ్‌గా టైమ్‌ని చూపిస్తుంది కూడా. మీ ఫోన్‌కి వచ్చే కాల్స్‌, మెసేజ్‌ అలెర్ట్‌లను వాచీలోనే చూడొచ్చు.
ధర రూ.1,299


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని