శీతాకాలంలో స్టైల్‌గా ఎలా?

ఈ కాలంలో స్టైలిష్‌గా ఉంటూనే చలి నుంచి రక్షణ కల్పించే ఎలాంటి దుస్తులు ధరించవచ్చు?

Published : 16 Dec 2017 01:59 IST

వేడివేడిగా...
శీతాకాలంలో స్టైల్‌గా ఎలా?

* ఈ కాలంలో స్టైలిష్‌గా ఉంటూనే చలి నుంచి రక్షణ కల్పించే ఎలాంటి దుస్తులు ధరించవచ్చు?

- శివరామ్‌, హైదరాబాద్‌

బాటమ్‌ ఎక్కువగా ఉండే జీన్స్‌కు ప్రాధాన్యం ఇవ్వాలి. జీన్స్‌ వాడలేని వారు లినన్‌లో మందమైన వస్త్రం అందుబాటులోకి వచ్చింది. దీన్ని తీసుకోవచ్చు. ఇక టీషర్ట్స్‌ విషయంలో మందమైనవి ఎంచుకోవాలి. ఇప్పుడు మార్కెట్లో స్వెట్టర్లలా కనిపించకుండా ఉండే టీషర్ట్స్‌ అందుబాటులోకి వచ్చాయి. షర్ట్స్‌ ధరించేవారు చెక్స్‌కు ప్రాధాన్యం ఇస్తే బాగుంటుంది. ఇందులో మీ ఎత్తు, బరువును బట్టి డిజైనర్‌ సలహా ప్రకారం ధరించవచ్చు. ఏవైనా ముదురు రంగులను ఎంచుకుంటే వెచ్చదనాన్ని ఇస్తాయి. నీలం, నలుపు, తెలుపు, పసుపు, ఆకుపచ్చ రంగులు చలికాలంలో బాగా మేలు చేస్తాయి. డెనిమ్‌, లినన్‌, మందమైన కాటన్‌ వస్త్రాలను ఎంపిక చేసుకుంటే మంచిది. యువత ఫుల్‌హ్యాండ్స్‌, హాఫ్‌ హ్యాండ్స్‌ జాకెట్లు, బ్లేజర్ల్లను ఎంచుకుంటున్నారు. వీటితో చక్కటి లుక్‌తోపాటు చలి నుంచి రక్షణ లభిస్తుంది.

- అవ్వారు రవి, ఫ్యాషన్‌ డిజైనర్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని