కొత్త ఫ్యాషన్స్‌ ఏమొస్తాయ్‌?

పాతవి వస్తుంటాయి. కొత్తవి పోతుంటాయి. వచ్చే ఏడాది పురుషుల ఫ్యాషన్‌ ప్రపంచం ఎలా ఉండబోతోంది? అనేది పారిస్‌ ఫ్యాషన్‌ లోకానికి కూడా అంతుచిక్కని...

Published : 30 Dec 2017 02:01 IST

లుక్‌ 2018
కొత్త ఫ్యాషన్స్‌ ఏమొస్తాయ్‌?

పాతవి వస్తుంటాయి. కొత్తవి పోతుంటాయి. వచ్చే ఏడాది పురుషుల ఫ్యాషన్‌ ప్రపంచం ఎలా ఉండబోతోంది? అనేది పారిస్‌ ఫ్యాషన్‌ లోకానికి కూడా అంతుచిక్కని ప్రశ్న! అయితే 2018లో కొన్ని కొత్తరకం డిజైన్లు హల్‌చల్‌ చేయొచ్చని డిజైనర్లు చెబుతున్నారు. అలాంటి వాటిలో.. ఫార్మల్‌ ఫ్రింటెడ్‌ జాకెట్లు, ఫ్లోరల్‌ ఫ్రింటెడ్‌ చొక్కాలు, గ్రాఫిక్‌ ఫ్రింట్లు, టెక్చర్‌, లెదర్‌ ప్యాంట్లు వంటివి ఉన్నాయి. వీటన్నిటిలోకి సైనికులు ధరించే యూనిఫాంను స్ఫూర్తిగా తీసుకుని చేసిన మరికొన్ని డిజైన్లు ఆకట్టుకోవచ్చు. ఇప్పటికైతే పని ప్రదేశాల్లో నిలువుగీతలు, లేతరంగుల చొక్కాలను ధరించేందుకే మగవాళ్లు ఇష్టపడుతున్నారు. భవిష్యత్తులో రకరకాల ఫ్రింటెండ్‌ షర్టులను ధరించే ధోరణి పెరగొచ్చు. తొంభైలలో వచ్చిన వదులు టీషర్టుల వంటివీ కొత్త సంవత్సరం వేసవిలో రావొచ్చన్నది నిపుణుల అంచనా. దీనికి కారణం ఈ మధ్య స్ట్రీట్‌ ఫ్యాషన్‌ల పట్ల యువత ఆసక్తి చూపిస్తుండటం. ఇక, అబ్బాయిలు, అమ్మాయిలు తొడుక్కునే బూట్ల విషయానికి వస్తే.. వైట్‌స్నేకర్స్‌, లోఫర్స్‌లకే ఎక్కువ మంది జైకొడుతున్నారు. వచ్చే ఏడాదిలోనూ వీటి హవా పెరుగుతుందే తప్ప తగ్గదు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని