కుర్తాలో కొత్తగా

కుర్తాలో మన లుక్కే మారిపోతోంది. అది వేసుకొని బయటికొస్తే.. అబ్బో అదిరింది.. ఏంటి స్పెషల్‌? అని నలుగురైనా అడుగుతారు. అందుకే కుర్తా ఎప్పుడూ ప్రత్యేకమే. ఈ ప్రత్యేకతకు కొత్తదనం జతచేస్తే అది మరింత అందం తెచ్చిపెడుతుంది....

Published : 02 Jun 2018 01:36 IST

కుర్తాలో కొత్తగా

కుర్తాలో మన లుక్కే మారిపోతోంది. అది వేసుకొని బయటికొస్తే.. అబ్బో అదిరింది.. ఏంటి స్పెషల్‌? అని నలుగురైనా అడుగుతారు. అందుకే కుర్తా ఎప్పుడూ ప్రత్యేకమే. ఈ ప్రత్యేకతకు కొత్తదనం జతచేస్తే అది మరింత అందం తెచ్చిపెడుతుంది. వేడుకలు, శుభకార్యాలు, పార్టీల్లో భిన్నంగా, కొత్తగా అందరినీ ఆకట్టుకోవాలంటే కుర్తాలో ఒదిగిపోవడం మంచిదంటున్నారు డిజైనర్లు. ఇందులో కాలర్‌, బాటమ్‌ కటింగ్‌, బటన్స్‌ అమరికలను బట్టి రకరకాలుగా డిజైన్‌ చేయించుకోవచ్చు. క్లాత్‌ ఎంపికలోనూ భిన్నత్వం మీలోని ఫ్యాషన్‌ ప్రియుణ్ని నలుగురికీ పరిచయం చేస్తుంది.కాలర్‌ : చైనీస్‌, రౌండ్‌, ఓపెన్‌ నెక్‌ ఇలా అనేకమున్నాయి. మీ శరీరతత్వం, మెడ ఆకృతిని బట్టి డిజైనర్‌ సలహా మేరకు వీటిని ఎంపికచేసుకోవచ్చు.
బటన్‌ : క్రాస్‌, స్ట్రైట్‌ బటన్‌(త్రీ, ఫుల్‌)లాంటివి అందుబాటులో ఉన్నాయి. ఇందులో క్రాస్‌ బటన్‌ యువతను ఎక్కువగా ఆకట్టుకుంటోంది. లెఫ్ట్‌కట్‌, రైట్‌ కట్‌ రెండు రకాలుగా ఉంటాయి.
బాటమ్‌కటింగ్‌ : ఇది ఇప్పుడు ట్రెండీగా మారింది. క్రాస్‌ కటింగ్‌, ఫ్రంట్‌ ఓపెన్‌, సైడ్‌ కట్స్‌, లాంగ్‌ అండ్‌ షార్ట్‌ కట్స్‌... ఇలా అనేక రకాలను యువత ఫాలో అవుతున్నారు. మహేశ్‌బాబు, రానా, రణ్‌వీర్‌లాంటి హీరోలు ధరించడంతో వీటికి బాగా క్రేజ్‌ వచ్చింది.
క్లాత్‌ : కాటన్‌, లెనిన్‌, జూట్‌, ఇక్కత్‌, ఖాదీ, కలంకారీ, పోచంపల్లి, నారాయణ్‌పేట్‌ డిజైన్స్‌ ప్రస్తుత ట్రెండ్‌.
* యువత కాలేజీ ఫంక్షన్లకు క్రాస్‌బటన్స్‌, బాటమ్‌ కట్స్‌ ఎక్కువగా  ధరిస్తున్నారు. చైనీస్‌ కాలర్లో ఫుల్‌, షార్ట్‌ కుర్తాలతో నైట్‌ పార్టీల్లో వెలిగిపోతున్నారు. రౌండ్‌నెక్‌ లాంగ్‌ కుర్తాలను పుట్టినరోజు, పెళ్లిరోజు, ఇతర శుభకార్యాలకు ధరించి మెరిసిపోతున్నారు. కొత్తపంథాలో పయనిస్తున్న యువత డిజైనర్ల సలహా మేరకు శరీర ఆకృతిని బట్టి కుర్తాలను తయారు చేయించుకొని ట్రెండీగా మారుతున్నారు.

- రవి అవ్వారు, అవ్వారు డిజైన్స్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని