గురూ.. ఎగురు

ఫిట్‌నెస్‌తో పాటు.. సరదా, సంతోషం ఇచ్చే వ్యాయామ పరికరాలకు ఎప్పుడూ మార్కెట్లో డిమాండ్‌ ఉంటుంది...

Published : 23 Jun 2018 03:30 IST

పోగోస్టిక్‌
గురూ.. ఎగురు

ఫిట్‌నెస్‌తో పాటు.. సరదా, సంతోషం ఇచ్చే వ్యాయామ పరికరాలకు ఎప్పుడూ మార్కెట్లో డిమాండ్‌ ఉంటుంది. అలాంటిదే పోగోస్టిక్‌. గతంలో ఇలాంటివి పాశ్చత్య దేశాల్లో చాలా ఉన్నా.. సరికొత్త ఫీచర్లతో అందుబాటులోకి వచ్చింది వీఫోర్‌ వెర్టిగో పోగోస్టిక్‌. ఇది స్మాల్‌, మీడియం, లాంగ్‌ వెర్షన్లలో ఉంది. దీనిపైకి ఎక్కి అలా ఎగురుతూ సరదాగా కొంత దూరం వెళితే సంతోషంతో పాటు, వ్యాయామమూ అవుతుందని చెబుతున్నారు కంపెనీ నిర్వాహకులు. ఇది 35 నుంచి 180 కిలోల వరకూ బరువును మోయగలదు. దీంతో 10 అడుగుల ఎత్తు వరకూ ఎగరొచ్చు. పైగా బరువు, ఎగరాలనుకొనే ఎత్తును బట్టి దీన్ని ఫీచర్లు మార్చుకొనే వెసులుబాటు ఉంది. అమెరికాలో సంచలనంగా మారిన ఈ పోగోస్టిక్‌ను ఇప్పుడిప్పుడే దిల్లీ, ముంబై నగరాల్లో యువత ఇష్టపడుతోంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని