మా పెళ్లికి రండి.. పుస్తకాలివ్వండి

‘‘బంధుమిత్రులతో కలిసి మా పెళ్లికి రండి. మాకు ఎలాంటి బహుమతులు తేవద్దు. మీకు వీలైతే పోటీ పరీక్షలకు సిద్ధమయ్యేందుకు ఉపయోగపడే పుస్తకాలు తెచ్చివ్వండి.’’

Published : 30 Jun 2018 01:49 IST

మా పెళ్లికి రండి.. పుస్తకాలివ్వండి

‘‘బంధుమిత్రులతో కలిసి మా పెళ్లికి రండి. మాకు ఎలాంటి బహుమతులు తేవద్దు. మీకు వీలైతే పోటీ పరీక్షలకు సిద్ధమయ్యేందుకు ఉపయోగపడే పుస్తకాలు తెచ్చివ్వండి.’’
- ఇదీ ఓ నూతన జంట అందరికీ పంపిన పెళ్లిపిలుపు. చూస్తే కొత్తగా ఉండటంతో పాటు... ఒక మంచి స్ఫూర్తి దాగుంది. మహారాష్ట్రకు చెందిన స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులు అమర్‌, పుణె విశ్వవిద్యాలయ ఆచార్యులు రాణిలు బృహత్తర లక్ష్యంతో వాట్సప్‌లో పంపిన పెళ్లి ఆహ్వానమిది. దీనికి మంచి మనసున్న వారెందరో స్పందించారు. ఈ జంట ఉద్దేశం నచ్చి బంధువులు, మిత్రులు కాకపోయినా పెళ్లికి వచ్చి వారిని ఆశీర్వదించారు. 3000 పుస్తకాలను బహుమతిగా ఇచ్చారు. ఇవి ఎంతోమంది పేద విద్యార్థులకు ఉపయోగపడ్డాయి. ఇప్పుడు అమర్‌, రాణిలు కలిసి అహ్మద్‌నగర్‌లో పేద విద్యార్థుల కోసం ఓ మంచి గ్రంథాలయం ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు