ఫిట్‌గా ఉంటే ఉచిత టికెట్‌

ఆఫీసుకెళ్లే హడావిడిలో వాలెట్‌ మర్చిపోయి మెట్రో స్టేషన్‌కి పరుగులు పెట్టారు. సరిగ్గా లోపల అడుగుపెట్టాక ఆ విషయం గుర్తుకొచ్చింది. అప్పుడేం చేస్తారు? అడగడానికి అక్కడ స్నేహితులు కూడా లేరు అప్పుడు...

Published : 13 Oct 2018 15:35 IST

ఫిట్‌గా ఉంటే ఉచిత టికెట్‌

ఆఫీసుకెళ్లే హడావిడిలో వాలెట్‌ మర్చిపోయి మెట్రో స్టేషన్‌కి పరుగులు పెట్టారు. సరిగ్గా లోపల అడుగుపెట్టాక ఆ విషయం గుర్తుకొచ్చింది. అప్పుడేం చేస్తారు? అడగడానికి అక్కడ స్నేహితులు కూడా లేరు అప్పుడు మీ పరిస్థితి ఏంటి? మన దగ్గరైతే వెనుతిరగాల్సిందే. రష్యాలో మాత్రం అలా కాదు. మాస్కో మెట్రో స్టేషన్‌లో డబ్బులేకపోతే దానికి బదులుగా ఓ ముప్ఫై సిటప్స్‌ లేదా స్వ్కాట్స్‌ తీసి ఫిట్‌నెస్‌ని నిరూపించుకుంటే చాలు. ఉచితంగా మెట్రోరైలు టిక్కెట్‌ దొరుకుతుంది. ఈ మెట్రోస్టేషన్‌లో ఏటీఎంల మాదిరిగా వరుసగా స్క్వాట్‌ సెన్సర్‌ మెషీన్లు ఉంటాయి. రెండంటే రెండు నిమిషాల్లో 30 స్వ్కాట్స్‌ తీయాల్సి ఉంటుంది. అలా తీయలేకపోతే ఆ ప్రయత్నం వృథా అవుతుంది. మళ్లీ కొత్తగా మొదలుపెట్టాల్సిందే. శారీరక దృఢత్వం అనేది క్రీడాకారులకు మాత్రమేకాదు ప్రజలందరికీ అవసరమే అని చెప్పడానికి అక్కడి ఒలింపిక్‌ కమిటీ చేసిన ప్రయత్నం ఇది. ఫిట్‌నెస్‌కి ఫిట్‌నెస్‌... ప్రయాణానికి ప్రయాణం రెండూ ఉచితం అన్నమాట.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు