కాదేది ఫ్యాషన్‌కు అనర్హం

పనికిరాని వలలు, వాడేసిన ప్లాస్టిక్‌, అరిగిపోయిన టైర్లు.. వీటితో ఏం చేయొచ్చు? అదేం ప్రశ్న... పనికిరావు కాబట్టి పడేయడమో, కాల్చేయడమో చేయాలి. మూడో మార్గం ఉందంటోంది... ఫ్యాషన్‌ ప్రపంచం. వీటితో కొత్త దుస్తులు తయారు చేసి.. ప్రపంచాన్ని చెత్త భారం నుంచి బయటపడేయటమే కాక.. ట్రెండీగా మార్చొచ్చని చెబుతున్నారు. వీటితో వస్త్రాలు, దుస్తులు...

Updated : 31 Dec 2018 17:12 IST

ప్లాస్టిక్‌, టైర్లు... 

కాదేది ఫ్యాషన్‌కు అనర్హం

నికిరాని వలలు, వాడేసిన ప్లాస్టిక్‌, అరిగిపోయిన టైర్లు.. వీటితో ఏం చేయొచ్చు? అదేం ప్రశ్న... పనికిరావు కాబట్టి పడేయడమో, కాల్చేయడమో చేయాలి. మూడో మార్గం ఉందంటోంది... ఫ్యాషన్‌ ప్రపంచం. వీటితో కొత్త దుస్తులు తయారు చేసి.. ప్రపంచాన్ని చెత్త భారం నుంచి బయటపడేయటమే కాక.. ట్రెండీగా మార్చొచ్చని చెబుతున్నారు. వీటితో వస్త్రాలు, దుస్తులు తయారు చేస్తున్నారు. వాస్తవానికి ఈ ట్రెండ్‌ ప్రయోగాత్మకంగా 2015లో ప్రారంభమైనా... ప్రస్తుతం ఊపందుకొంది. పరిశ్రమల్లో చేతులు తుడుచుకున్నాక వదిలేసే వ్యర్థాలను సైతం ఉపయోగించి ఫ్యాషన్‌ దుస్తులు తయారు చేసి అదరగొడుతున్నారు డిజైనర్లు. కాఫీ, టీలు తాగాక గ్లాసులో మిగిలే గసితోనూ దుస్తులు తయారు చేసి సృజనాత్మకతను చాటుకుంటున్నారు. వీటన్నింటికీ సహజ రంగులనే ఉపయోగిస్తూ ప్రశంసలు అందుకుంటున్నారు. ఈ దుస్తులను మార్కెట్లోకి తెస్తున్నారు.

కాదేది ఫ్యాషన్‌కు అనర్హం


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని