మాసిన షూ రూ.61,938

చెదిరిన జుట్టు.. చిరిగిన ప్యాంటు... ఫ్యాషన్‌ ట్రెండ్‌గా నడిచే ఈ రోజుల్లో మాసిన షూ యువతకు నచ్చదా? అనుకుంది ప్రముఖ పాదరక్షల కంపెనీ గూచీ. అందుకే ‘డర్టీ స్నీకర్స్‌’ పేరుతో షూ తయారు చేసింది. 1970లలో ఆటగాళ్ల షూ మాసి పోయి ఉండేవి.

Published : 02 Mar 2019 00:58 IST

చెదిరిన జుట్టు.. చిరిగిన ప్యాంటు... ఫ్యాషన్‌ ట్రెండ్‌గా నడిచే ఈ రోజుల్లో మాసిన షూ యువతకు నచ్చదా? అనుకుంది ప్రముఖ పాదరక్షల కంపెనీ గూచీ. అందుకే ‘డర్టీ స్నీకర్స్‌’ పేరుతో షూ తయారు చేసింది. 1970లలో ఆటగాళ్ల షూ మాసి పోయి ఉండేవి. తెల్లని షూపై మాపు, బురద, మరకలతో ఇవి దర్శనమిచ్చేవి. అచ్చం అలాంటి లుక్‌తోనే ఈ షూ విడుదల చేసింది కంపెనీ. ఇదేం పెద్ద విషయం కాకపోయినా వీటి ధర వింటే మాత్రం కళ్లు తిరుగుతాయి. హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో ట్రిపుల్‌ బెడ్‌రూం ఫ్లాట్‌కి ఒక నెల బాడుగ కట్టొచ్చు ఈ డబ్బుతో. ఇంతకీ ధర చెప్పలేదు కదూ రూ.61,938 (870 యూఎస్‌ డాలర్లు).


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని