వెలిసిన రంగులే హాయి!!

సీజన్లు మారినట్టుగానే కుర్రాళ్ల స్టైల్సూ మారిపోతాయి. అందుకే ఇప్పుడు అందరి దృష్టి సమ్మర్‌ ఫ్యాషన్స్‌పైనే. మండే వేడికి కూల్‌గా చెక్‌ పెట్టాలంటే? అందుకు ఒక్కటే మార్గం. వెలిసి పోయినట్టుగా కనిపించే లైట్‌ దుస్తుల్ని ధరించడమే. వీటిని ‘టాన్‌ ఫార్మల్‌ వేర్‌’గా పిలుస్తున్నారు. పద్ధతిగా ఆఫీస్‌లకు వెళ్లేవారే కాదు...

Updated : 13 Apr 2019 04:02 IST

‘కూల్‌’ట్రెండ్‌

సీజన్లు మారినట్టుగానే కుర్రాళ్ల స్టైల్సూ మారిపోతాయి. అందుకే ఇప్పుడు అందరి దృష్టి సమ్మర్‌ ఫ్యాషన్స్‌పైనే. మండే వేడికి కూల్‌గా చెక్‌ పెట్టాలంటే? అందుకు ఒక్కటే మార్గం. వెలిసి పోయినట్టుగా కనిపించే లైట్‌ దుస్తుల్ని ధరించడమే. వీటిని ‘టాన్‌ ఫార్మల్‌ వేర్‌’గా పిలుస్తున్నారు. పద్ధతిగా ఆఫీస్‌లకు వెళ్లేవారే కాదు. స్టైల్‌గా సమ్మర్‌ హాలీడేస్‌ని ఎంజాయ్‌ చేసే చిన్నోళ్లూ వెలిసినట్టుగా కనిపించేవాటిని ఏరి కోరి సెలెక్ట్‌ చేస్తున్నారు. సూట్‌ల ఎంపికలోనూ ముదురు రంగుల్ని పక్కన పెడితే మంచిది. ఒకవేళ కళ్లలో పడే రంగులే మీకు ఇష్టమైతే సూట్‌ జాకెట్‌ లోపల డార్క్‌ కలర్‌ షర్టులను ప్రయత్నించొచ్చు. ఇక చెప్పులు, బూట్ల విషయానికొస్తే అవీ లైటే! గోధుమ రంగు సరైన ఎంపిక.


 


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని