40 దాటిన నవ యవ్వనులు
‘నలభై దాటితే జిమ్ గడప దాటాల్సిన పన్లేదు’.. ‘ఫిట్నెస్కి ఫుల్స్టాప్ పెట్టేయాల్సిందే’.. ఇదీ కొందరి అభిప్రాయం. ఈ భావన తప్పు అన్నది ఫిట్నెస్ గురూల మాట. సాక్ష్యం కావాలా? కండరగండడు, మిస్టర్ పర్ఫెక్ట్లు అనిపించుకున్న ఈ ముదురు హీరోలను చూడండి. వాళ్లు చెప్పే ఫిట్నెస్ కిటుకులు పట్టేయండి.
హృతిక్ రోషన్
వయసు: 47
పాఠం: బాలీవుడ్లో తీరైన శరీరాకృతి అంటే ముందు గుర్తొచ్చేది హృతిక్ రోషనే. ఎప్పటికప్పుడు వర్కవుట్లు మార్చడం తన పద్ధతి. ఉదయం లేవగానే కార్డియో వ్యాయామాలు చేస్తాడు. సాయంత్రాలు స్ట్రెంగ్త్ వర్కవుట్లపై దృష్టి పెడతాడు. ఉదయం ఎండలో పదినిమిషాలైనా కసరత్తులు చేస్తాడట. దాంతోపాటు ఎట్టిపరిస్థితుల్లోనూ ఆహార నియమాలు తప్పడు. మ్యాక్రో, మైక్రో న్యూట్రియెంట్స్ సమ్మిళిత ఆహారం తీసుకుంటాడు.
ఫర్హాన్ అక్తర్
వయసు: 47
పాఠం: పాత్రకు తగ్గట్టు శరీరాన్ని ఎలాగైనా మలచుకోగల నటుడిగా పేరు తెచ్చుకున్నాడు ఫర్హాన్. భాగ్ మిల్కా భాగ్, తూఫాన్ సినిమాల్లో టోన్డ్, సిక్స్‌ప్యాక్ బాడీలతో ఆకట్టుకున్నాడు. వీటికన్నా ముందు నుంచే అక్తర్ ఫిట్నెస్కి అత్యధిక ప్రాధాన్యం ఇస్తాడు. కఠోర కసరత్తులు కాకపోయినా నడక, తేలికపాటి వ్యాయామాలు.. అతడి దినచర్యలో భాగం. ఇవి ప్రతి మనిషికీ అత్యవసరం అంటాడు.
అక్షయ్ కుమార్
వయసు: 53
పాఠం: ఫిట్నెస్కి షార్ట్కట్లు ఉండవనేది అక్కీ మాట. రాత్రి తొమ్మిదికి ముందే నిద్రపోవడం, ఉదయం ఐదున్నరకే మేల్కొవడం అలవాటు. కాసేపు ఎండలో గడపడం, ఇంటి ఆహారాన్నే తీసుకోడం, క్రమం తప్పని వ్యాయామాలు తన దినచర్యలో భాగం. కండలు పెంచడం కన్నా ఫిట్‌గా ఉండేందుకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తాడు.
జాన్ అబ్రహం
వయసు: 48
సలహా: బాలీవుడ్లో పర్ఫెక్ట్ బాడీ నటుల్లో జాన్ ఒకడు. ఫిట్‌నెస్‌ని ఇష్టమైన ఆటగా భావిస్తాడు. ఒక్కరోజు కూడా తప్పడానికి ఇష్టపడడు. కార్డియో, స్ట్రెంగ్త్, బ్యాలెన్స్ వ్యాయామాలు ఎక్కువగా చేస్తుంటాడు. వీటితోపాటు సైక్లింగ్, ఫుట్‌బాల్ ఆడటం తప్పనిసరి.
ఆమిర్‌ఖాన్
వయసు: 56
సలహా: బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ ఫిట్నెస్ కాపాడుకోవడంలోనూ పర్ఫెక్టే. పాత్రకు తగ్గట్టు శరీరాన్ని ఎలాగైనా మలిచేస్తాడు. బాడీకి తగినంత విశ్రాంతినిస్తే మనం చెప్పినట్టుగా వింటుంది అంటాడు. కఠినంగా శ్రమించడం, మంచి ఆహారం తీసుకోవడం.. ఈ రెండింటితో శరీరాన్ని శిల్పంలా చెక్కి, పదిలంగా కాపాడుకోవచ్చు అన్నది అతడి సలహా. ఓట్స్, గింజ ధాన్యాలు, ఫైబర్, ప్రొటీన్ ఎక్కువగా ఉండే ఆహారం రోజుకి ఆరుసార్లు తీసుకుంటాడు. ఛెస్ట్, షోల్డర్ ఎక్సర్సైజ్లు ఎక్కువ చేస్తుంటాడు.
సైఫ్ అలీఖాన్
వయసు: 50
సలహా: యాభై ఏళ్ల వయసులోనూ ఫిట్నెస్ బాడీతో యువతకు మార్గదర్శిలా ఉండే హీరో సైఫ్. సుదూర నడకే తన ఫిట్నెస్ విజయరహస్యం అంటాడు. ట్రెడ్మిల్, కుదిరితే బయటికెళ్లి నడవడం.. ఏదైనా సరే రోజుకి ఐదారు కిలోమీటర్లు తప్పనిసరి. ఇదే కార్డియో అనీ, బరువు తగ్గడానికి, ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉండటానికి కారణం అంటాడు.
Advertisement
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
75th Independence Day: ఎర్రకోట వేడుకల్లో.. అత్యాధునిక తుపాకులతో ‘గన్ సెల్యూట్’
-
World News
Death Valley: డెత్ వ్యాలీలో వరద బీభత్సం.. అరుదైన వర్షపాతం నమోదు
-
Sports News
Rohit sharma: ఈ ఫ్లాన్తోనే భారత క్రికెట్‌కు మంచి భవిష్యత్‌ను అందిస్తాం: రోహిత్ శర్మ
-
Viral-videos News
Viral Video: చీమల్ని తిన్న వీడియోకు 10మిలియన్ల వ్యూస్!
-
Movies News
Shilpa Shetty: చిత్రీకరణలో గాయపడ్డ శిల్పాశెట్టి
-
General News
Pancreatitis: కడుపులో నొప్పిగా ఉంటుందా..? ఇది ఎలా వస్తుందో తెలుసా..
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Prashant Kishor: నీతీశ్ అందుకే భాజపాను వీడారు..!
- Heart Attack: గుండెపోటు ఎలా వస్తుందో తెలుసా..?
- Aamir Khan: ‘గత 48గంటల నుంచి నేను నిద్రపోలేదు’ : ఆమిర్‌ఖాన్
- Viral Video: చీమల్ని తిన్న వీడియోకు 10మిలియన్ల వ్యూస్!
- Shilpa Shetty: చిత్రీకరణలో గాయపడ్డ శిల్పాశెట్టి
- IIT Madrasలో రికార్డుస్థాయి ప్లేస్మెంట్లు..ఓ విద్యార్థికి ₹2కోట్ల వార్షిక వేతనం!
- Rohit sharma: ఈ ఫ్లాన్తోనే భారత క్రికెట్‌కు మంచి భవిష్యత్‌ను అందిస్తాం: రోహిత్ శర్మ
- Death Valley: డెత్ వ్యాలీలో వరద బీభత్సం.. అరుదైన వర్షపాతం నమోదు
- UN: ఐరాస ఉగ్ర ఆంక్షల విధానాలపై మండిపడ్డ భారత్..!
- నేను చెప్పేవరకూ ఎఫైర్ వార్తలను సీరియస్‌గా తీసుకోవద్దు: రష్మిక