ఈటెలాంటి కుర్రాడు!
ఈటె విసిరి ఒలింపిక్స్ స్వర్ణాన్ని ఒడిసిపట్టిన నీరజ్ చోప్రా ఇప్పుడు అమ్మాయిల కలల రాకుమారుడు. నేషనల్ క్రష్. ఈ క్రీడాకారుడు ఆటలు కాకుండా బాగా అభిమానించేది ఏంటో తెలుసా? బైక్‌లు, కార్లు. ఏమాత్రం తీరిక దొరికినా లాంగ్‌డ్రైవ్‌లకు ఈటెలా దూసుకెళ్లిపోతుంటాడు. తన గ్యారేజీలో ఉన్న వాహనాలేంటో చూడండి.
బజాజ్ పల్సర్ 220 ఎఫ్: సంపాదన మొదలైన తర్వాత సొంత డబ్బులతో కొనుక్కున్న మొదటి బైక్ ఇది. సొంతూరు పానిపట్ నుంచి దిల్లీకి ఈ బండిపైనే వందలసార్లు చక్కర్లు కొట్టానంటాడు. దానిపై జావెలిన్ త్రో విసురుతున్న తన రేడియం స్టిక్కర్ అతికించుకున్నాడు. 220సీసీ సామర్థ్యం, రూ.లక్షన్నర ఖరీదు ఉండే ఈ టూవీలర్ దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న ద్విచక్రవాహనాల్లో ఒకటి.
హార్లీ డేవిడ్‌సన్ 1200 రోడ్‌స్టర్: ఏషియన్ గేమ్స్‌లో పతకం గెలిచిన తర్వాత ఈ క్రూజర్‌ని సొంతం చేసుకున్నాడు. 1202సీసీ ఈ బండి సొంతం. 180 కిలోమీటర్ల టాప్‌స్పీడ్‌తో వెళ్తుంది. ధర రూ.12లక్షలు.
ఆడీ క్యూ5: నీరజ్ దగ్గరున్న కార్లలో అత్యంత ఖరీదైంది ఇదే. ధర రూ.60లక్షలు. దిల్లీలో ఉన్నప్పుడు ఎక్కువగా ఈ కారునే వాడుతుంటాడు. 1,960 సీసీ, 222 బీహెచ్‌పీ ఇంజిన్‌తో పని చేస్తుంది.
టయోటా ఫార్చునర్: కామన్వెల్త్ గేమ్స్‌లో బంగారు పతకం నెగ్గిన తర్వాత తనకొచ్చిన నజరానాలతో ఈ కారును తన గ్యారేజీకి తీసుకొచ్చాడు. ధర రూ.35లక్షలు. 2,755సీసీతో దూసుకెళ్తుంది.
మహీంద్రా ఎక్స్‌యూవీ 700: ఒలింపిక్స్‌లో స్వర్ణం గెలిచినందుకు మహీంద్రా అండ్ మహీంద్రా అధిపతి ఆనంద్ మహీంద్రా నీరజ్‌కి ఇచ్చిన నజరానా. ఏడు సీట్ల కారు. కుటుంబంతో ఎక్కడికెళ్లినా దీన్నే ఉపయోగిస్తానన్నాడు నీరజ్.
Advertisement
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
World News
Death Valley: డెత్ వ్యాలీలో వరద బీభత్సం.. అరుదైన వర్షపాతం నమోదు
-
India News
75th Independence Day: ఎర్రకోట వేడుకల్లో.. అత్యాధునిక తుపాకులతో ‘గన్ సెల్యూట్’
-
Sports News
Rohit sharma: ఈ ఫ్లాన్తోనే భారత క్రికెట్‌కు మంచి భవిష్యత్‌ను అందిస్తాం: రోహిత్ శర్మ
-
Viral-videos News
Viral Video: చీమల్ని తిన్న వీడియోకు 10మిలియన్ల వ్యూస్!
-
Movies News
Shilpa Shetty: చిత్రీకరణలో గాయపడ్డ శిల్పాశెట్టి
-
General News
Pancreatitis: కడుపులో నొప్పిగా ఉంటుందా..? ఇది ఎలా వస్తుందో తెలుసా..
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Prashant Kishor: నీతీశ్ అందుకే భాజపాను వీడారు..!
- Heart Attack: గుండెపోటు ఎలా వస్తుందో తెలుసా..?
- Viral Video: చీమల్ని తిన్న వీడియోకు 10మిలియన్ల వ్యూస్!
- Shilpa Shetty: చిత్రీకరణలో గాయపడ్డ శిల్పాశెట్టి
- Aamir Khan: ‘గత 48గంటల నుంచి నేను నిద్రపోలేదు’ : ఆమిర్‌ఖాన్
- UN: ఐరాస ఉగ్ర ఆంక్షల విధానాలపై మండిపడ్డ భారత్..!
- IIT Madrasలో రికార్డుస్థాయి ప్లేస్మెంట్లు..ఓ విద్యార్థికి ₹2కోట్ల వార్షిక వేతనం!
- Rohit sharma: ఈ ఫ్లాన్తోనే భారత క్రికెట్‌కు మంచి భవిష్యత్‌ను అందిస్తాం: రోహిత్ శర్మ
- Thief: ‘నన్ను క్షమించు తల్లీ’.. దేవతను వేడుకొని మరీ హుండీ ఎత్తుకెళ్లిన దొంగ
- Death Valley: డెత్ వ్యాలీలో వరద బీభత్సం.. అరుదైన వర్షపాతం నమోదు