Updated : 28 Aug 2021 04:32 IST
అందం, ఆరోగ్యం @ యాప్
ఆఫీసు చికాకులతో పిచ్చెక్కుతోంది అంటాడో కుర్ర ఉద్యోగి. లావైపోతున్నానని ఓ టీనేజీ అమ్మాయి బాధ. ఫిట్‌నెస్ కావాలి.. ఓ గురువు ఉంటే బాగుండు అన్నది ఇంకో అబ్బాయి సమస్య. ఇలాంటి బాధలు ఉన్నవారు యువతలో బోలెడు. వీరందిరికీ ఉపయోగపడే యాప్ Verv. మానసిక ప్రశాంతత, ధ్యానం, వ్యాయామం, డైట్ సలహాలు.. ఇలా అన్నిరకాల సమస్యలకు పరిష్కారం చూపిస్తుంది. వ్యాయామం ఎలా చేయాలో చెబుతుంది. ఎలాంటి శరీర తత్వం ఉన్నవాళ్లు ఎలాంటి ఆహారం తీసుకోవాలో సూచిస్తుంది. మానసిక చికాకులకు పరిష్కారం ఇస్తుంది. స్మార్ట్‌ఫోన్‌ని హస్తభూషణంగా భావించే యూత్ దీన్ని డౌన్‌లోడ్ చేసుకోవాల్సిందే.
బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్.. ఏ సమయంలో ఏమేం ఆహారం తీసుకోవాలో విడమరిచి చెబుతుంది. ఆన్‌లైన్ సలహాలు అందించడానికి నిపుణులు సైతం సిద్ధంగా ఉంటారు.
Advertisement
Tags :