మనం మారిపోతున్నాం..
ఆన్లైన్లో ఒక్క క్లిక్‌తో స్నేహం చిగుర్లు వేస్తోంది. సెల్‌ఫోన్ ప్రపంచం మొత్తాన్ని ఏకం చేస్తోంది. అంతా సాంకేతికత మహిమ. అదేసమయంలో మనుషుల మనసుల్లో మకిలి నింపుతూ, అబద్ధాలకోరుగా మార్చేస్తోందట ఇదే టెక్నాలజీ, సోషల్ మీడియా. సమాచార పరిశోధకుడు జెఫ్ హాంకాక్స్ తన సహచరులతో కలిసి చేసిన అధ్యయన ఫలితాల ఆధారంగా ఈ మాట చెబుతున్నాడు. ఇద్దరు స్నేహితులు, సహోద్యోగులు, కుటుంబ సభ్యులు.. ఎవరైనా ముఖత: మాట్లాడుకున్నప్పుడు, అభిప్రాయాలు పంచుకున్నప్పుడు నిజాయతీగా స్పందిస్తున్నారట. అదే ఫోన్‌కాల్స్ మాట్లాడినప్పుడు, అంతర్జాలంలో చాటింగ్, సందేశాలు పంపుకున్నప్పుడు మాత్రం వ్యక్తిత్వంపై ముసుగు వేసుకుంటూ మాకేంటి అని ఆలోచిస్తున్నారట. హాంకాక్ ఈ మనస్తత్వానికి ‘ఫీచర్ బేస్డ్ మోడల్’ అని పేరు పెట్టాడు. ఈ అధ్యయనం కోసం హాంకాక్ పలు దేశాల్లోని కొందరు యూనివర్సిటీ విద్యార్థులను ఎంపిక చేశాడు. వాళ్లు ఇతరులతో ఎదురెదురుగా సంభాషించినప్పుడు మనస్ఫూర్తిగా ఉన్నారా? ఫోన్, ఎసెమ్మెస్‌లు, చాటింగ్.. ద్వారా నిజాయతీగా ఉన్నారా విశ్లేషించాడు. పాతరోజుల్లో ఎలా ఉండేవారో సీనియర్లనూ ఆరా తీశాడు. చివరకు తేలిన ఫలితం ఏంటంటే.. 2004 నుంచి ఫోన్, సామాజిక మాధ్యమాల వాడకం పెరిగినకొద్దీ మనుషుల్లో కృత్రిమత్వం, స్వార్థం పెరిగిపోతుందని చెప్పాడు. ఈ సర్వేలో మొత్తం పదిహేను వేలకు పైగా యువతీ, యువకులు తమ అభిప్రాయాలు పంచుకున్నారు.
Advertisement