మనసారా ఆట మొదలెట్టేసింది!

ఆట వదిలినా.. క్రికెట్‌తో అనుబంధం వదల్లేదు సచిన్‌ తెందుల్కర్‌. దేశంలోని కోట్లమందికి ఇప్పటికీ ఆరాధ్యుడే తను. ఆ మేటి ఆటగాడి కూతురు సారా వంతు వచ్చింది ఇప్పుడు. తను సొగసుల ఆట మొదలుపెట్టింది. అదేనండీ..

Updated : 18 Dec 2021 06:24 IST

ఆట వదిలినా.. క్రికెట్‌తో అనుబంధం వదల్లేదు సచిన్‌ తెందుల్కర్‌. దేశంలోని కోట్లమందికి ఇప్పటికీ ఆరాధ్యుడే తను. ఆ మేటి ఆటగాడి కూతురు సారా వంతు వచ్చింది ఇప్పుడు. తను సొగసుల ఆట మొదలుపెట్టింది. అదేనండీ.. మోడల్‌గా క్యాట్‌వాక్‌ షురూ చేసింది. ఈ సందర్భంగా ఆ అమ్మాయి గురించి మరిన్ని వివరాలు.

అసలే సచిన్‌ కూతురు..  పైగా అందమైన అమ్మాయి. ఫ్యాషన్‌గా ఉంటుంది.. అందుకే తనకి ఇన్‌స్టాగ్రామ్‌లో 16 లక్షల మంది ఫాలోయర్లున్నారు. సంగీతం అంటే చాలా ఇష్టం. సింగర్‌ ఎడ్‌ షీరన్‌ని ఆరాధిస్తుంది. తరచూ దూరప్రయాణాలు చేస్తుంది.

* సచిన్‌ తన కూతురికి ‘సారా’ అనే పేరు పెట్టడానికో ఫ్లాష్‌బ్యాక్‌ ఉంది. 1997లో కెప్టెన్‌గా తెందుల్కర్‌ సహారా కప్‌ నెగ్గాడు. అది పెద్ద విజయం. ఆ గుర్తుగానే కూతురికి సారా అని నామకరణం చేశాడు.
* సారా ముంబయిలోని ధీరూభాయ్‌ అంబానీ ఇంటర్నేషనల్‌ స్కూల్‌లో చదువుకుంది. ఆ స్కూల్‌ క్రమశిక్షణకి, సృజనాత్మక విద్యకి పెట్టింది పేరు. తర్వాత తల్లి అంజలి బాట ఎంచుకొని యూనివర్సిటీ కాలేజ్‌ ఆఫ్‌ లండన్‌లో మెడిసిన్‌ పూర్తి చేసింది.
* సారా బాలీవుడ్‌ నటుడు రణ్‌వీర్‌ సింగ్‌కి వీరాభిమాని. తన సినిమా ఫస్ట్‌ డే, ఫస్ట్‌ షోనే చూస్తుందట. బాజీరావు మస్తానీ తనకిష్టమైన చిత్రం. ఆమధ్య తను షాహిద్‌కపూర్‌కి జతగా తెరంగేట్రం చేస్తోందని వార్తలొచ్చాయి. అవన్నీ పుకార్లేనని కొట్టిపడేశాడు సచిన్‌. ముగ్ధ్దమనోహర రూపం, కెమెరా ప్రెజెన్స్‌, సెన్స్‌ ఆఫ్‌ హ్యూమర్‌.. సారాని ఎప్పటికైనా బాలీవుడ్‌ క్వీన్‌ని చేస్తాయంటున్నారు ఫ్యాన్స్‌.

* తను నాన్నకూచి. సచిన్‌ బయోపిక్‌ ‘సచిన్‌: ఏ బిలియన్‌ డ్రీమ్స్‌’లో తండ్రితో అనుబంధం, మర్చిపోలేని జ్ఞాపకాలెన్నో పంచుకుంది. అమ్మమ్మ అనాబెల్‌ మెహతాని రోల్‌మోడల్‌గా భావిస్తుంటుంది. వాళ్లిద్దరూ కలిసి కొన్ని స్వచ్ఛంద సంస్థలకు విరాళాలు కూడా సేకరించారు.
* క్రికెటర్‌ శుభ్‌మన్‌ గిల్‌తో పీకల్లోతు ప్రేమలో ఉందని వార్తలొస్తున్నాయి. దీనిపై ఇంతవరకు ఎవరూ పెదవి విప్పలేదు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు