వీళ్లలా.. పట్టు వదలొద్దు..

ఫర్దీన్‌ఖాన్‌ ఒకప్పటి టాప్‌ హీరో. భారతీసింగ్‌... స్టార్‌ స్టాండప్‌ కమెడియన్‌. దేశమంతా పరిచయం ఉన్నవారే. కాకపోతే వాళ్ల ఆకారం భారీగా ఉంటుంది. గతేడాది ‘మేం సన్నబడతాం.. ఫిట్‌నెస్‌ సాధిస్తాం.

Updated : 01 Jan 2022 02:39 IST

ఫర్దీన్‌ఖాన్‌ ఒకప్పటి టాప్‌ హీరో. భారతీసింగ్‌... స్టార్‌ స్టాండప్‌ కమెడియన్‌. దేశమంతా పరిచయం ఉన్నవారే. కాకపోతే వాళ్ల ఆకారం భారీగా ఉంటుంది. గతేడాది ‘మేం సన్నబడతాం.. ఫిట్‌నెస్‌ సాధిస్తాం. ఇదే మా న్యూ ఇయర్‌ రెజల్యూషన్‌’ అని భీషణ ప్రతిజ్ఞ చేశారు. పో.. పోవోయ్‌.. ఇది అయ్యే పని కాదని పెదవి విరిచారు చాలామంది. వాళ్లు వెనక్కి తగ్గలేదు. ఇచ్చిన మాట మర్చిపోలేదు. మళ్లీ కొత్త ఏడాది వచ్చేసింది కదా! ఈ సందర్భంగా ఇన్‌స్టాలో ఫొటోలు షేర్‌ చేశారు. భారతి ఏకంగా పదిహేడు కిలోలు తగ్గి నాజూగ్గా తయారైంది. ‘బరువు తగ్గాక ఎంతో బాగుంది. చురుగ్గా ఉండగలుగుతున్నా. ఆస్తమా కూడా అదుపులో ఉంది’ అంటూ పోస్ట్‌ చేసింది. చేతినిండా సినిమాలున్నప్పుడు ఫిట్‌గా ఉన్న ఫర్దీన్‌ తర్వాత కదల్లేనంతగా పెరిగిపోయాడు. పిల్లలు బలవంతం చేయడంతో జిమ్‌లోకి దిగాడట. ‘ఆరునెలలలో ఇరవై కేజీలు తగ్గాను. మళ్లీ నటించాలనే ఉత్సాహం పెరిగింది’ అంటున్నాడు. వీళ్ల స్ఫూర్తితో మనమూ ప్రయత్నిస్తే పోలా!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని