చిన్న చిట్కాలు.. అన్యోన్యత డబుల్‌

లైలా-మజ్ఞు, దేవదాసు-పారూ, సలీం-అనార్కలీ జోడీల్లా ఉండాలని అందరూ అనుకుంటారు. ఉండేది మాత్రం కొందరే. ఇంతకీ ఆ గొప్ప ప్రేమికులు, పడుచు జంటల మధ్య అన్యోన్యత ఎలా అంటారా?

Updated : 22 Jan 2022 06:12 IST

లైలా-మజ్ఞు, దేవదాసు-పారూ, సలీం-అనార్కలీ జోడీల్లా ఉండాలని అందరూ అనుకుంటారు. ఉండేది మాత్రం కొందరే. ఇంతకీ ఆ గొప్ప ప్రేమికులు, పడుచు జంటల మధ్య అన్యోన్యత ఎలా అంటారా? ఇవిగోండి చిట్కాలు.

* పెద్ద నిర్ణయాలు కలిసే తీసుకుంటారు. చిన్నచిన్న విషయాలూ పంచుకుంటారు.

* ప్రేమ ప్రదర్శించే ఏ సందర్భం వదులుకోరు. శుభాకాంక్షలు చెప్పుకోవడం, చిన్నచిన్న బహుమతులు ఇచ్చిపుచ్చుకోవడం.

* తమ ఆంతరంగిక విషయాల్లో ఇతరుల జోక్యం సహించరు.

* కష్టం, సుఖం.. ప్రతి సందర్భంలో ఒకరికొకరు తోడుంటారు.

* మరింత దగ్గరవడానికి అప్పుడప్పుడూ దూర ప్రయాణాలు చేస్తుంటారు.

* ఇతరులతో పోల్చుకోరు. వేరేవాళ్లలా ఉండాలని ప్రయత్నించరు.

* ఎంత దగ్గరైనా కొంత ప్రైవసీ ఇచ్చిపుచ్చుకుంటారు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని