మెదడుకి యౌవనం తొడిగేద్దాం

ఇంట్లో కూర్చుంటే.. ఫోన్‌, కంప్యూటర్‌కే అతుక్కుపోతే మెదడు రిఫ్రెష్‌ కాలేదు. క్రమం తప్పని నడక, చిన్నపాటి వ్యాయామాలు.. మెదడు, శరీరం రెండింటికీ మంచిదే. కదలికలతో శరీరానికంతటికి రక్తప్రసరణ పెరిగి ఆరోగ్యంగా ఉంటాం. మెదడు ఆరోగ్యంగా

Updated : 05 Feb 2022 05:12 IST

ఇంట్లో కూర్చుంటే.. ఫోన్‌, కంప్యూటర్‌కే అతుక్కుపోతే మెదడు రిఫ్రెష్‌ కాలేదు. క్రమం తప్పని నడక, చిన్నపాటి వ్యాయామాలు.. మెదడు, శరీరం రెండింటికీ మంచిదే. కదలికలతో శరీరానికంతటికి రక్తప్రసరణ పెరిగి ఆరోగ్యంగా ఉంటాం. మెదడు ఆరోగ్యంగా ఉండాలంటే శరీరమూ ఫిట్‌గా ఉండాల్సిందే.

మంచి డ్రెస్‌ వేసి.. టిప్‌టాప్‌గా తయారై.. కళ్లకి గాగుల్స్‌ పెట్టి.. అక్కడక్కడ నెరిసిన జుత్తుకు రంగు వేస్తే.. అంకుల్స్‌ కూడా పాతికేళ్ల కుర్రాళ్లలాగే కనిపిస్తుంటారు. అది సరే.. వార్ధక్యంలోకి వెళ్తున్న మనసు, మెదడుని నిత్యనూతనంగా ఉంచుకోవడం ఎలా? దానికి కొన్ని ట్రిక్స్‌ ఉన్నాయి బాస్‌! ఇవి ఫాలో అవ్వండి.

పుస్తకాల్ని మించిన నేస్తాలు ప్రపంచంలో మరేవీ లేవంటారు. ఒక్కసారి ఆ స్నేహంలోని మజాని రుచి చూస్తే ఆ ఫ్రెండ్షిప్‌ని ఎవరూ వదలరు. పొత్తాలు మాట్లాడతాయి.. కవ్విస్తాయి.. నవ్విస్తాయి.. అనుభూతుల్ని పంచుతాయి. వెల కట్టలేని జ్ఞానాన్నీ ఇస్తాయి. రోజుకి కాసేపు పుస్తక పఠనానికి కేటాయిస్తే మెదడు చురుగ్గా ఉంటుంది.

అలవాటో, అనారోగ్యమో.. కొందరు వాలిపోయినట్టుగా నడుము వంచి కూర్చుంటారు. ఇది మంచి పద్ధతి కాదు. ఎప్పుడైనా నిటారుగా కూర్చోవాలి. ఇలా చేస్తే వెన్నునొప్పి తగ్గుతుంది. మానసిక అసమతౌల్యాలు నియంత్రణలో ఉంటాయి. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.

డ్యాన్స్‌, సంగీతం.. మెదడుని సానబెట్టే అద్భుత ప్రక్రియలు. తరచూ స్టెప్పులేస్తుంటే.. సంగీతం వింటే.. శరీరం, మనసు ఉత్తేజితమవుతాయి. మెదడు ఉల్లాసంగా ఉంటుంది. తరచూ సాధన చేస్తుంటే ఆలోచనల్లో వేగం, త్వరగా స్పందించే గుణం పెరుగుతాయంటారు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని