Updated : 19 Mar 2022 04:14 IST

ఆన్‌లైన్‌కే..అంతా జై!

మాల్స్‌కి మహారాజపోషకులు.. ఈ-కామర్స్‌ వెబ్‌సైట్లకి ఇంధనం.. ఇంకెవరు? యువతనే. గతంతో పోలిస్తే.. వాళ్ల షాపింగ్‌ ధోరణిలో ఎలాంటి మార్పులు వచ్చాయో తెలుసుకోవడానికి ‘ఫామ్‌ పే’ సంస్థ అధ్యయనం చేసింది. ఆ వివరాలు.

* భారతీయ యువత.. ముఖ్యంగా కౌమారప్రాయుల్లో 84శాతం మంది ఆఫ్‌లైన్‌ షాపింగ్‌ కన్నా ఆన్‌లైన్‌ షాపింగ్‌నే ఎక్కువగా ఇష్టపడుతున్నారు. కాలికి తొడిగే పాదరక్షల నుంచి హస్తభూషణమైన సెల్‌ఫోన్‌ దాకా అన్నింటినీ అంతర్జాలంలోనే జల్లెడ పట్టి కొనుగోలు చేస్తున్నారు.
52శాతం నగదు ద్వారా కొనుగోళ్లు చేస్తుంటే.. మిగతా 48శాతం డెబిట్‌, క్రెడిట్‌ కార్డులను వాడుతున్నారు. గతేడాదితో పోల్చుకుంటే ఇది 44 శాతం అధికం.
వీళ్లు అత్యధికంగా ఖరీదు చేస్తోంది దుస్తులు, గ్యాడ్జెట్లు, ఆహారంపైనే. తర్వాత స్థానం మ్యూజిక్‌, ఓటీటీ సబ్‌స్క్రిప్షన్లు.  
ఆన్‌లైన్‌లో కొంటున్నాం కదా అని యువత ఆషామాషీ వాటి జోలికి వెళ్లడం లేదు. 61 శాతం కుర్రకారు బ్రాండెడ్‌ వస్తువులకే ఓటేస్తున్నారు.
వయసులవారీగా చూస్తే ఆన్‌లైన్‌ కొనుగోలుదారుల్లో 24శాతం టీనేజీ, 59శాతం మంది 20 నుంచి 35 ఏళ్ల లోపు వారున్నారు.


Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts