ఆలియా.. సాధించింది!

‘ఎంతైనా ట్రోల్‌ చేయండి. నా పనితీరుతోనే సమాధానం చెబుతా. నేనేంటో నిరూపిస్తా’ అని సవాల్‌ చేసిన బాలీవుడ్‌ లేత పరువాల భామ ఆలియా భట్‌ తానేంటో నిరూపించుకుంది.

Published : 19 Mar 2022 08:49 IST

‘ఎంతైనా ట్రోల్‌ చేయండి. నా పనితీరుతోనే సమాధానం చెబుతా. నేనేంటో నిరూపిస్తా’ అని సవాల్‌ చేసిన బాలీవుడ్‌ లేత పరువాల భామ ఆలియా భట్‌ తానేంటో నిరూపించుకుంది. ఔను మరి.. ఇప్పుడు తను ఏకంగా హాలీవుడ్‌ సినిమాకే సంతకం చేసింది. అది ఆమె నటనకి దక్కిన గౌరవం. కెరియర్‌ మొదలుపెట్టిన కొత్తలో కనీసం జనరల్‌ నాలెడ్జ్‌ లేదంటూ తనని అంతా విమర్శించేవారు. తన తెలివితేటలపై ఎమోజీలు, ఫన్నీ మీమ్స్‌ కూడా వచ్చాయి. అయినా వాటినేం పట్టించుకోలేదు. నటనతోనే సమాధానం చెప్పాలనుకుంది. ‘ఉడ్తా పంజాబ్‌’, ‘రాజీ’ సినిమాలతో తానేంటో నిరూపించుకుంది. తాజాగా ‘గంగూభాయ్‌ కథియావాడీ’తో మరో మెట్టు ఎక్కింది. ఇప్పుడు ‘హార్ట్‌ ఆఫ్‌ స్టోన్‌’తో  హాలీవుడ్‌లోనూ అరంగేట్రం చేయబోతోంది. వివరాలు ఇన్‌స్టాలో ప్రకటించింది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని