పనిమంతులమవుదాం..

పొద్దంతా కంప్యూటర్‌తో కుస్తీ పడుతూనే ఉంటారు. అయినా పని ఎంతకీ తెమలదు. బాస్‌తో శెభాష్‌ అనిపించుకోవాలనే తపనతో రగిలిపోతుంటారు. ఫలితం పెద్దగా కనిపించదు. మరెలా? చేస్తున్న ఉద్యోగం, పనిలో మంచి ఫలితాలు సాధించడమెలా?

Updated : 16 Apr 2022 01:35 IST

పొద్దంతా కంప్యూటర్‌తో కుస్తీ పడుతూనే ఉంటారు. అయినా పని ఎంతకీ తెమలదు. బాస్‌తో శెభాష్‌ అనిపించుకోవాలనే తపనతో రగిలిపోతుంటారు. ఫలితం పెద్దగా కనిపించదు. మరెలా? చేస్తున్న ఉద్యోగం, పనిలో మంచి ఫలితాలు సాధించడమెలా?

రేపు ఏం చేయాలో, ఎలా చేయాలో ఈరోజు రాత్రే ప్రణాళిక వేసుకుంటే సగం పని పూర్తైనట్టే అంటారు. పడక ఎక్కే ముందే చేయాల్సిన పనుల జాబితా స్పష్టంగా ఒక కాగితంపై రాసుకోవడం అలవాటుగా చేసుకోవాలి. దీంతో సమయం చాలా ఆదా అవుతుంది. 

 పనులు చాలానే ఉంటాయి. ఏది ముందు చేయాలి? ఏది వాయిదా వేసుకోవచ్చు? ఏది కొంచెం ఆలస్యమైనా ఫర్వాలేదు.. ఇలా విభజించుకుంటే బాస్‌తో చీవాట్లు ఉండవు. చికాకులూ తప్పుతాయి.

క్షణం తీరిక లేకుండా పని చేసినా కొందరికి పెద్దగా ఫలితాలు కనిపించవు. అలా అనిపిస్తే లోపం ఎక్కడుందో ఓసారి రివ్యూ చేసుకోవాల్సిన అవసరం ఉంది. మీకున్న సమయంలోనే పనిని చిన్నచిన్న భాగాలుగా విభజించుకొని ఏ సమయంలో ఏది ముగించుకోవాలో ఒక లక్ష్యం పెట్టుకోవాలి. 

ఈమెయిళ్లు, ఫోన్‌కాల్స్, సామాజిక మాధ్యమాలు, గేమ్స్, సినిమాలు.. ఇవన్నీ ఏకాగ్రత చెడగొడతాయి. పని చేసేటప్పుడు ఫోన్‌ స్విచ్చాఫ్‌ చేయడం, సోషల్‌మీడియా నోటిఫికేషన్లు ఆఫ్‌ చేయడం, షాపింగ్‌ సైట్లు తెరవకపోవడం.. ఉత్పాదకతను పెంచుతాయి. 

ఒకే సమయంలో నాలుగైదు రకాల పనులు చేయాలనుకోవడం అంత మంచిది కాదు. ఒక అధ్యయనం ప్రకారం మల్టీ టాస్కింగ్‌ చేయడం వల్ల ఉత్పాదకత 40 శాతం పడిపోతుందని తేలింది.

చుట్టూ ఉన్న వాతావరణం బాగుంటే.. ఆటోమేటిగ్గా పనిలో వేగం పెరుగుతుంది. బాతాఖానీలు కొట్టేవాళ్లకి దూరంగా, మంచి పోటీ వాతావరణం ఉన్న వ్యక్తుల మధ్య ఉండేలా చూసుకోవాలి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని