స్నేహం.. బ్రేకప్‌

జిగిరీ దోస్త్‌.. ఒక్కసారిగా మాట్లాడ్డం మానేస్తే...? నిన్నటిదాకా భుజాలపై చేతులు వేసుకొని తిరిగినవాళ్లు  ఉన్నపళంగా బ్రేకప్‌ చెప్పేస్తే..? జీర్ణించుకోవడం కష్టమే. ఈ బాధ నుంచి తేరుకోవాలంటే..?

Updated : 16 Apr 2022 01:36 IST

జిగిరీ దోస్త్‌.. ఒక్కసారిగా మాట్లాడ్డం మానేస్తే...? నిన్నటిదాకా భుజాలపై చేతులు వేసుకొని తిరిగినవాళ్లు  ఉన్నపళంగా బ్రేకప్‌ చెప్పేస్తే..? జీర్ణించుకోవడం కష్టమే. ఈ బాధ నుంచి తేరుకోవాలంటే..?

  

మనసెరిగిన ఫ్రెండ్‌ ఇక మనతో ఉండరంటే ఎవరికైనా ఇబ్బందే. ఈ దుఃఖాన్ని దాచుకునే ప్రయత్నం చేయొద్దు. ఇది తొలగిపోయే దాకా మనసారా ఏడవండి. ఏడుపు గుండెల్లోని బాధను తగ్గిస్తుంది అంటారు మానసిక నిపుణులు. 

కారణం ఏదైనా మంచి స్నేహితుడికి దూరమైనప్పుడు భరించలేనంత బాధ ఉంటుంది. వాళ్లకి బలవంతంగా దగ్గరవడానికి ప్రయత్నించవద్దు. అపోహలు, పొరపొచ్చాలు మంచు ముక్కలా కరిగిపోయేవరకు కొన్నాళ్లు ఎదురు చూడాలి.

కష్టసుఖాలు పంచుకునే తోడు కోల్పోయినప్పుడు ప్రపంచంతో సంబంధాలు తెగిపోయినట్టే. అయినా పదేపదే అదే మననం చేసుకోకుండా ఇద్దరి మధ్యా ఫొటోలు, వీడియోలు, సరదాలు, ప్రయాణాలు..   ఈ జ్ఞాపకాలు ఓసారి గుర్తు చేసుకోండి. 

క్లోజ్‌ఫ్రెండ్‌ దూరమైతే ఆ స్థానాన్ని భర్తీ చేసేవాళ్లు ఎక్కడో ఒకచోట తారస పడకపోరు. మీ బాధని భాగస్వామి, సహోద్యోగి, థెరపిస్ట్, కుటుంబ సభ్యులు.. ఎవరితోనైనా పంచుకోండి. ఒక్కోసారి మనం ఊహించని మంచి సలహాలు దొరకొచ్చు. మనసు తెలుసుకునేవాళ్లు, అర్థం చేసుకునేవాళ్లు దొరక్కపోరు. అలాగని వెంటనే బీఎఫ్‌ఎఫ్‌ కావాలనే తొందర అసలే వద్దు.

ఖాళీగా ఉంటే పదే పదే ఆ ఆలోచనలే వస్తుంటాయి. దుఃఖం  రెట్టింపు అవుతుంది. అందుకే బాధ పడే సమయమే లేకుండా ఏదో ఒక పని కల్పించుకోండి. కొన్నాళ్లు సామాజిక మాధ్యమాల్లో బృంద చర్చల్లో పాల్గొనండి. 


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని