యువత మెచ్చే.. బీఎండబ్ల్యూ బండి!

ద్విచక్ర వాహనాల్ని, సంస్థ అమ్మకాల్ని పరుగులు పెట్టించేది యువతే. అందుకే వాళ్లని ఆకట్టుకునేలా ‘బీఎండబ్ల్యూ మోటరాడ్‌’ ఎఫ్‌900 ఎక్స్‌ఆర్‌ మోడల్‌ విపణిలోకి తీసుకొచ్చింది. ఫీచర్లు ఏంటంటే..

Published : 16 Apr 2022 01:34 IST

ద్విచక్ర వాహనాల్ని, సంస్థ అమ్మకాల్ని పరుగులు పెట్టించేది యువతే. అందుకే వాళ్లని ఆకట్టుకునేలా ‘బీఎండబ్ల్యూ మోటరాడ్‌’ ఎఫ్‌900 ఎక్స్‌ఆర్‌ మోడల్‌ విపణిలోకి తీసుకొచ్చింది. ఫీచర్లు ఏంటంటే..

సాంకేతికాంశాలు: 895 సీసీ, 4 స్ట్రోక్‌ ఇన్‌లైన్‌ 2 సిలిండర్‌ ఇంజిన్‌తో పని చేస్తుంది. ఇంజిన్‌ సామర్థ్యం 105హెచ్‌పీ.

అత్యధిక వేగం: 200కి.మీ.లు/గంటకి. 3.6సెకన్లలో వంద కిలోమీటర్ల వేగం అందుకుంటుంది. 

ఫీచర్లు: 6.5 అంగుళాల టీఎఫ్‌టీ తెర ఉంది. వేగం, ఇంధనం, టార్క్‌.. వివరాలన్నీ అందులో చూడొచ్చు. దీన్ని బీఎండబ్ల్యూ మోటరాడ్‌ యాప్‌తో అనుసంధానం చేసుకోవచ్చు.

భద్రత: గేర్‌ షిఫ్ట్‌ అసిస్ట్‌ ప్రో, డైనమిక్‌ ఇంజిన్‌ బ్రేక్‌ కంట్రోల్, ఏబీఎస్, డైనమిక్‌ ట్రాక్షన్‌ కంట్రోల్‌.. ఇవన్నీ బండి ఎంత వేగంలో ఉన్నా రైడర్‌కి వాహనంపై నియంత్రణ ఉండేలా చేస్తాయి. 

ధర: రూ.12.30లక్షలు (ఎక్స్‌ షోరూం) 


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని