యువత మెచ్చే బైక్‌లివే!

ప్రతి వాహన కంపెనీ ఏ కొత్త మోడల్‌ తీసుకొచ్చినా.. మొదటి లక్ష్యం యువతను ఆకట్టుకోవడమే. మరి ఏ మోడళ్లు కుర్రకారుకి బాగా ఇష్టం అంటే ఇవిగోండి టాప్‌ 3.

Updated : 30 Apr 2022 03:49 IST

ప్రతి వాహన కంపెనీ ఏ కొత్త మోడల్‌ తీసుకొచ్చినా.. మొదటి లక్ష్యం యువతను ఆకట్టుకోవడమే. మరి ఏ మోడళ్లు కుర్రకారుకి బాగా ఇష్టం అంటే ఇవిగోండి టాప్‌ 3.

కేటీఎం 125 డ్యూక్‌

కేటీఎం 125 డ్యూక్‌

మొదటిసారి బైక్‌ ఎక్కే కాలేజీ విద్యార్థుల ఎంపిక ఇది. స్టైలిష్‌ రూపం, మేటి పికప్‌, ఏబీఎస్‌లాంటి భద్రతా పీచర్లు దీని సొంతం. ఈ 125సీసీ బైక్‌ ధర రూ.1.70లక్షలు


బజాజ్‌ పల్సర్‌ ఎన్‌ఎస్‌ 200

యువత పల్స్‌ పట్టిన బండి ఇది. అమ్మకాల్లో అత్యధికం కాలేజీ విద్యార్థులవే. 200సీసీ, 23.5బీహెచ్‌పీ ఇంజిన్‌తో క్షణాల్లో వేగం అందుకుంటుంది. ధర రూ.1.37 లక్షలు.


టీవీఎస్‌ అపాచీ ఆర్‌టీఆర్‌ 160 4వీ

ఈ స్టైలిష్‌ రూపం సొంతం చేసుకోవడానికి ఎక్కువమంది కుర్రాళ్లు ఎగబడతారు.డిజిటల్‌ ఇన్‌స్ట్రుమెంట్‌ క్లస్టర్‌, అత్యాధునిక హెడ్‌ల్యాంప్‌ డీఆర్‌ఎల్‌లు, డిస్క్‌ బ్రేక్‌లు.. 159.సీసీ.. యువతకు నచ్చే ఫీచర్లు. ధర రూ.1.12లక్షలు
 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని