ఇన్‌స్టా కాదు.. ఫిన్‌స్టా

వేలకొద్దీ ఫాలోయర్లు ఉండాలి.. సెలెబ్రిటీలతో ఫొటోలు దిగి షేర్‌ చేయాలి.. డిజైనర్‌ డ్రెస్‌ వేసి పోజు కొట్టాలి.. వారానికి ఒకటైనా ‘రీల్‌’ వదలాలి.. 

Published : 21 May 2022 00:54 IST

వేలకొద్దీ ఫాలోయర్లు ఉండాలి.. సెలెబ్రిటీలతో ఫొటోలు దిగి షేర్‌ చేయాలి.. డిజైనర్‌ డ్రెస్‌ వేసి పోజు కొట్టాలి.. వారానికి ఒకటైనా ‘రీల్‌’ వదలాలి.. 

ఇన్‌స్టాగ్రామ్‌లో పేరు కోసం ఎన్ని చేయాలో! ఈ అభిప్రాయం ఉన్న కుర్రకారు.. ముఖ్యంగా కౌమార ప్రాయులు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారంటున్నాయి అధ్యయనాలు. ముంబయిలో అయితే ఒక టీనేజీ అమ్మాయి తన ఫ్రెండ్‌కి ఉన్న పాపులారిటీ తట్టుకోలేక ఆమెపై హత్యాయత్నం చేసిన సంఘటన ఈమధ్యే చదివాం. ‘ఈ అనవసర ఆందోళన తప్పాలంటే.. సింపుల్‌గా సామాజిక మాధ్యమాల్ని పక్కన పెడితే సరి’ అంటారు పెద్దలు. ఉన్నఫళంగా అలా చేయాలంటే ఎవరికైనా కష్టమే. మరైతే దారేంటి? అంటే ‘ఫిన్‌స్టా’ అన్నది సమాధానం. ఫిన్‌స్టా.. అంటే ఇదేదో ప్రత్యేకమైన వెబ్‌సైట్ కాదు.. యాప్‌ అంతకన్నా కాదు. ఇది ఫేక్‌ ఇన్‌స్టాగ్రామ్‌. ఇన్‌స్టాగ్రామ్‌లోనే రెండో ఖాతా సృష్టించుకోవచ్చు.

ఇందులో పరుగు పందేలు ఉండవు. ఫిల్టర్లు వేసి, ఫొటోలకు మెరుగులు దిద్ది అప్‌లోడ్‌ చేయాల్సిన పని లేదు. మంచీ చెడు అన్నీ నిస్సంకోచంగా పంచుకోవచ్చు. వ్యక్తిత్వానికి ముసుగులు వేసే పనేం లేదు. అమ్మ పర్స్‌లోంచి దొంగిలించిన డబ్బు.. టీనేజీలో టీచరుపై పెంచుకున్న క్రష్‌.. పాత బ్రేకప్‌లు.. ప్రస్తుత ప్యార్‌లు.. ఏదైనా షేర్‌ చేసుకోవచ్చు. అభిరుచులకు అనుగుణంగా గ్రూపులు ఉంటాయి. కొందరైతే ఈ ఫిన్‌స్టాని ఒక కన్ఫెషన్‌ వేదికగా మలచుకుంటున్నారు. తప్పులు చెప్పుకుంటున్నారు. బాధలు పంచుకుంటున్నారు. తమ గురించి గొప్పగా చెప్పుకునే వాళ్లు ఇన్‌స్టాని వేదికగా మలచుకుంటే.. నిష్కల్మషంగా ఉండేవాళ్లు ఫిన్‌స్టా బాట పడుతున్నారు. అందుకే ఇప్పుడు ఫిన్‌స్టా ట్రెండ్‌ జోరందుకుంటోంది. 


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని