4 నిమిషాల్లో.. పడిపోతారట!

కళ్లూ కళ్లు కలుసుకోవడం, మనసులు ఊసులాడుకోవడం.. ఆపై కుర్రది, కుర్రాడు లోకం మరిచి మాట్లాడుకోవడం.. ఒకరికొకరు నచ్చేయడం... ఇదంతా నాలుగే నాలుగు నిమిషాల్లో జరిగిపోతుందట. తాజా అధ్యయనంలో తేలిందీ విషయం. అయితే ఈ నిబంధన

Published : 25 Jun 2022 00:55 IST

కళ్లూ కళ్లు కలుసుకోవడం, మనసులు ఊసులాడుకోవడం.. ఆపై కుర్రది, కుర్రాడు లోకం మరిచి మాట్లాడుకోవడం.. ఒకరికొకరు నచ్చేయడం... ఇదంతా నాలుగే నాలుగు నిమిషాల్లో జరిగిపోతుందట. తాజా అధ్యయనంలో తేలిందీ విషయం. అయితే ఈ నిబంధన అపరిచితులకే తప్ప సుపరిచతులు, స్నేహితులకు వర్తించదట. కన్నార్పకుండా ఒకర్నొకరు చూసుకోవడం ఆకర్షణే అయినా.. అది ఐదు సెకన్లకు మించి కొనసాగితే అమ్మాయి, అబ్బాయి మనసుల్లో అలజడి మొదలవుతుందట. అలాగే నిమిషాల్లోకి చేరితే.. అవతలి వాళ్ల శరీర భాష, పద్ధతులు గమనిస్తారు. వారి గురించి ఇంకా తెలుసుకోవాలనే ఆరాటం పెరుగుతుందని అధ్యయనంలో పాల్గొన్న యువత సెలవిచ్చారు. ఇలా కళ్లలోకి చూడటం కొందరికి నచ్చదు. ఇద్దరిలో ఎవరైనా ఒకరు తల తిప్పేసుకోవడం, మొహం చిట్లించడం చేస్తున్నారంటే.. ఎదుటివాళ్ల ప్రపోజల్‌ని ఒప్పుకోవడం లేదనే అర్థం. ఏదేమైనా ఎదుటివాళ్ల చూపులతోనే గుండెకు సంకేతాలు అందుతాయట.

అబ్బాయిలు అమ్మాయిల్లో ముందు అందం చూసిన తర్వాతే పద్ధతులు, శరీర భాష, వ్యక్తిగత సమాచారం తెలుసుకోవాలని ఉబలాటపడతారు. అమ్మాయిలు కుర్రాళ్లలో శరీర భాష, పద్ధతి, నడవడిక, అలంకరించుకున్న తీరు.. ఆసక్తిగా గమనిస్తారట. ఈ కాలంలో డేటింగ్‌ వెబ్‌సైట్‌ల హవా పెరిగిపోవడానికి ఈ మనస్తత్వమే కారణమంటారు. సైట్‌లో ఉంచిన అమ్మాయి లేదా అబ్బాయి ఫొటో చూసిన వెంటనే వీళ్లు మనకి సరిపోతారు. వీళ్లు కరెక్ట్‌ కాదు.. అని ఒక అంచనాకి వచ్చేస్తారట. అన్నీ నచ్చి, కుదిరితే టపీమని ప్రేమలో పడిపోతారట.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని