టైగర్‌ ‘డెడ్‌లిఫ్ట్‌’ పాఠాలు

హిట్టు, ఫట్టులు పక్కనపెడితే బాలీవుడ్‌లో ఫిట్‌ హీరో ఎవరంటే అంతా చెప్పేది టైగర్‌ ష్రాఫ్‌ అనే. ఎటు కావాలంటే అటు మెలికలు తిరిగే బాడీ తనది. మరి తనకి నచ్చే వర్కవుట్‌ ఏది అంటే ‘డెడ్‌లిఫ్ట్‌’ అంటాడు. ఉన్నచోటే నిల్చొని, ఎలాంటి ఆసరా లేకుండా

Published : 02 Jul 2022 00:52 IST

హిట్టు, ఫట్టులు పక్కనపెడితే బాలీవుడ్‌లో ఫిట్‌ హీరో ఎవరంటే అంతా చెప్పేది టైగర్‌ ష్రాఫ్‌ అనే. ఎటు కావాలంటే అటు మెలికలు తిరిగే బాడీ తనది. మరి తనకి నచ్చే వర్కవుట్‌ ఏది అంటే ‘డెడ్‌లిఫ్ట్‌’ అంటాడు. ఉన్నచోటే నిల్చొని, ఎలాంటి ఆసరా లేకుండా ఒక పొజిషన్‌ తీసుకొని బరువులు ఎత్తడమే  ఈ డెడ్‌లిఫ్ట్‌. ఇదెందుకు ప్రత్యేకం అంటే...

* డెడ్‌లిఫ్ట్‌లు వ్యాయామంలో భాగమైతే వెన్ను నొప్పి మటుమాయమవడం ఖాయం. వర్క్‌ ఫ్రం హోం.. గంటలకొద్దీ కంప్యూటర్‌ ముందు కూర్చోవడం తప్పనిసరైన కుర్ర ఉద్యోగులు, కాలేజీ కుర్రాళ్లకు ఇది మంచి వర్కవుట్‌.
* ఈ కసరత్తు మెడ నుంచి కాలి దాకా ప్రభావం చూపిస్తుంది. శరీరంలోని దాదాపు అన్ని కండరాలు దృఢమవుతాయి. ఎముక సాంద్రత పెరుగుతుంది. తుంటి, కాలి పిక్కలు గట్టి పడతాయి. వెన్నెముకకి మంచిదని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు.
* ఒత్తిళ్లు, ఉరుకుల పరుగుల జీవితంతో ఈతరం శృంగార సమస్యలతో సతమతమవుతోంది. ఈ రెసిస్టెన్స్‌ వర్కవుట్లతో అబ్బాయిల్లో టెస్టోస్టిరాన్‌ స్థాయిలు పెరుగుతాయంటారు నిపుణులు. కండరాలూ వృద్ధి చెందుతాయి. అంటే మీలో రొమాంటిక్‌ భావనలు తగ్గకూడదన్నా ఈ వ్యాయామం అవసరం.
* డెడ్‌లిఫ్ట్‌తో పొట్ట, వీపులాంటి కోర్‌ కండరాలు దృఢమవుతాయి. ఫిట్‌నెస్‌ సాధించడంలో ఇది కీలకం. ఈ భాగంపైనే ఇతర కండరాలు ఆధారపడి ఉంటాయి. శరీరంపై నియంత్రణ ఉంటుంది.
* ఈ వర్కవుట్‌ క్రమం తప్పకుండా చేస్తే మంచి శరీరాకృతి సొంతమవుతుంది. అనవసర కొవ్వు కరిగి అందంగా, ఫిట్‌గా తయారవుతారు. దీంతో అబ్బాయిల్లో ఆత్మవిశ్వాసమూ పెరుగుతుంది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని