వయసేంటి?లక్ష్యమేంటి?

కళాశాల క్యాంపస్‌ నుంచి కాలు బయట పెట్టగానే యువతకి కెరీర్‌ వేట మొదలువుతుంది. కొంచెం ముందో, వెనకో.. ఉద్యోగాల్లో కుదురుకుంటారు. తర్వాతేంటి? అనే ఆలోచనే ఉండదు చాలామందికి

Updated : 16 Jul 2022 03:40 IST

కళాశాల క్యాంపస్‌ నుంచి కాలు బయట పెట్టగానే యువతకి కెరీర్‌ వేట మొదలువుతుంది. కొంచెం ముందో, వెనకో.. ఉద్యోగాల్లో కుదురుకుంటారు. తర్వాతేంటి? అనే ఆలోచనే ఉండదు చాలామందికి. కానీ వయసుకనుగుణంగా ఈ స్థాయిలో ఉండాలనే లక్ష్యం ఏర్పరచుకోవాలంటారు కెరియర్‌ నిపుణులు.

వయసు: 25

పాతికేళ్లు వచ్చేసరికి చదువు పూర్తై, ఎంచుకోబోయే ఉద్యోగానికి సంబంధించిన నైపుణ్యాలు సంపాదించుకోవాలి. రాబోయే ఇరవై ఏళ్లలో భవిష్యత్తులో ఎలా ఉండాలో కచ్చితంగా లక్ష్యాలు ఉండాలి. తన ఖర్చులు సొంతంగా సంపాదించుకోవడమే కాదు.. భవిష్యత్తు అవసరాల కోసం పొదుపు చేయడం ప్రారంభించాలి. కెరియర్‌లో ఎదగడానికి పనికొచ్చే పరిచయాలు, నైపుణ్యాలు పెంచుకుంటూ ఉండాలి.

వయసు: 35 

ఈ వయసు వచ్చేసరికి వృత్తిగతంగా, వ్యక్తిగతంగా ఒక స్థాయికి చేరుకొని ఉండాలి. టీం లీడర్‌గా, మేనేజర్‌గా పదోన్నతులు అందుకోవాలి. ఇళ్లు, కారులాంటి మధ్యస్థాయి లక్ష్యాలు చేరుకోవాలి. కెరియర్‌ ప్రారంభించినప్పుడు ఎవరైతే గురువులు, సీనియర్లు, మెంటర్లు ఉంటారో.. వారి సలహాలు తీసుకుంటూనే.. పాత, కొత్త తరాలకు వారిధిలా ఉండాలి.

వయసు: 45

పని చేస్తున్న రంగంలో నిపుణుడి హోదా అందుకోవాలి. మన ప్రతిభ, తెలివితేటలకు జనం మెచ్చి మన ఆలోచనలు, సలహాలు ఇతరులు స్వీకరించి, ఆచరించే స్థాయికి చేరాలి. వృత్తిపరంగా మనకంటూ ఒక  నెట్‌వర్క్‌ ఏర్పడాలి. సొంత సంస్థ ఏర్పాటు చేసి పదుగురికి ఉపాధి కల్పించే స్థాయికి ఎదగాలి.

 


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని