సందేశం పంపితే సంతోషం

మనసుకి నచ్చిన వారి నుంచి సందేశం అందుకుంటే చెప్పలేనంత సంతోషం కలుగుతుంది. ఇందులో కొత్తేముంది? అందరికీ తెలిసిన విషయమేగా అంటారా.. అసలు ట్విస్ట్‌ ఏంటంటే.. మెసేజ్‌లు అందుకున్న వారికే కాదు.. పంపిన వారికి కూడా ఆనందం బోనస్‌గా అందుతుందట.

Published : 23 Jul 2022 01:58 IST

నసుకి నచ్చిన వారి నుంచి సందేశం అందుకుంటే చెప్పలేనంత సంతోషం కలుగుతుంది. ఇందులో కొత్తేముంది? అందరికీ తెలిసిన విషయమేగా అంటారా.. అసలు ట్విస్ట్‌ ఏంటంటే.. మెసేజ్‌లు అందుకున్న వారికే కాదు.. పంపిన వారికి కూడా ఆనందం బోనస్‌గా అందుతుందట. జూడ్‌ స్టీవెన్‌ అనే ఆస్ట్రియన్‌ పరిశోధకుడు ఎనిమిది వారాలపాటు కాలేజీ విద్యార్థులు, యువతపై అధ్యయనం చేసి ఈ విషయం తేల్చాడు. ప్రియమైన వ్యక్తులకు సందేశం పంపే ముందు ఎవరైనా వాళ్ల మనసు ఎలా గెలుచుకోవాలో అని ఆలోచిస్తారట. పంపిన సందేశం అవతలివాళ్లు అందుకోగానే వాళ్లలో కలిగే భావోద్వేగాలు, సంతోషం ఎలా ఉంటాయో ఊహించుకుంటారు. ఈ ఊహలతో మెదడులో ఒక రకమైన రసాయన చర్య జరుగుతుంది. ఆక్సిటోసిన్‌, డోపమైన్‌, సెరటోనిన్‌ హార్మోనులు విడుదలవుతాయి. ఇవన్నీ సానుకూల సంకేతాలుగా మారి సానుకూల భావోద్వేగానికి గురి చేస్తాయి. ఇలాంటివి దీర్ఘకాలంలో సుఖమయమైన జీవితాన్ని అందిస్తాయంటున్నారు పరిశోధకులు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని