గమ్యం కాదు.. గమనం ముఖ్యం

ఈమధ్యే జరిగిన సంఘటనలివి. అనుకున్న లక్ష్యం నెరవేరడం లేదని అర్థాంతరంగా జీవితం చాలిస్తే అర్థమేముంది? లక్ష్యాలు ఊరికే ఊరికే నెరవేరవు. ఆటంకాలుంటాయి.. అడ్డంకులు వెక్కిరిస్తుంటాయి. అన్నింటినీ ఒడుపుగా దాటినప్పుడే గమ్యం చేరతాం. గమ్యం చేరడం కన్నా గమనమే ముఖ్యమని ఇలా తెలుసుకోవాలి.  

Updated : 30 Jul 2022 00:51 IST

* ఇన్‌స్టాలో ఫాలోవర్లు పెరగడం లేదని ఐఐటీయన్‌ ఆత్మహత్య...

* వ్యాపారంలో ఫెయిలయ్యానని యువ వ్యాపారి బలవన్మరణం...

ఈమధ్యే జరిగిన సంఘటనలివి. అనుకున్న లక్ష్యం నెరవేరడం లేదని అర్థాంతరంగా జీవితం చాలిస్తే అర్థమేముంది? లక్ష్యాలు ఊరికే ఊరికే నెరవేరవు. ఆటంకాలుంటాయి.. అడ్డంకులు వెక్కిరిస్తుంటాయి. అన్నింటినీ ఒడుపుగా దాటినప్పుడే గమ్యం చేరతాం. గమ్యం చేరడం కన్నా గమనమే ముఖ్యమని ఇలా తెలుసుకోవాలి.

* ఆత్మపరిశీలన: ఎంత శ్రద్ధగా వెళ్లినా లక్ష్యానికి ఆమడ దూరంలో నిలిచి పోతున్నాం. వరుసపెట్టి వైఫల్యాలే వెక్కిరిస్తున్నాయి. అప్పుడు లోపం ఎక్కడుందో ఒక్కసారి ఆత్మపరిశీలన చేసుకోవాల్సిందే. వెనక్కి తిరిగి నడిచి వచ్చిన దారి సరైందో, కాదో పరిశీలన చేయాల్సిందే.

* సహజం: ప్రతి రంగంలో వైఫల్యాలు సహజం. కుంగిపోవద్దు. వెయ్యి ఫెయిల్యూర్స్‌ తర్వాతే థామస్‌ అల్వా ఎడిసన్‌ బల్బు కనుగొన్నాడు. ‘నా ప్రతీ ప్రయత్నం విజయమే. తొమ్మిది వందల తొంభై తొమ్మిదిసార్లు ఏం చేయకూడదో తెలుసుకున్నా’ అంటాడు. అంటే ప్రతి వైఫల్యం మనకో పాఠం నేర్పుతూనే ఉంటుంది.

* స్వీకరించాలి: రాత్రికి రాత్రే విజయాలు దక్కవు. ఒక్కోసారి నెల అనుకున్నది ఏడాది పట్టొచ్చు. ఒక్కోసారి విజయం చివరి మెట్టుపై చతికిలపడొచ్చు. అన్నింటికీ తయారు కావాలి. ప్లాన్‌ బి సిద్ధం చేసుకోవాలి.

* పట్టువిడుపులు: ఈత రావాలంటే నీటిలోకి దిగాల్సిందే. గట్టునుండి మెలకువలు పట్టేస్తానంటే కుదరదు. ప్రయత్న లోపం లేకున్నా, విపరీతంగా కష్టపడుతున్నా.. గమ్యం చేరడం లేదంటే.. ఒక్కోసారి మనం ఎంచుకున్న మార్గమే తప్పు కావొచ్చు. రివ్యూ చేసుకుంటుండాలి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని