నడిపించేవాడే.. నాయకుడు!

స్టార్టప్‌, కార్పొరేట్‌ ఆఫీసు.. కార్యస్థలం ఏదైనా జట్టుని ముందుండి నడిపించే నాయకుడిదే కీలకపాత్ర.

Published : 27 Aug 2022 01:16 IST

స్టార్టప్‌, కార్పొరేట్‌ ఆఫీసు.. కార్యస్థలం ఏదైనా జట్టుని ముందుండి నడిపించే నాయకుడిదే కీలకపాత్ర. సభ్యుల నుంచి మంచి ఫలితాలు రాబట్టాలంటే నాయకుడు ఏ విధంగా ఉండాలంటే..

* నిర్భీతి: లీడర్‌ నిజాలు చెప్పటానికి సిద్ధంగా ఉండాలి. దానివల్ల కష్టనష్టాలు తప్పవని తెలిసినా నిర్భీతి ప్రదర్శించగలగాలి. కొన్ని కొన్ని క్లిష్ట సమయాల్లో ధైర్యంగా నిర్ణయాలు తీసుకోగలగాలి.

* గౌరవం: మనకింద పనిచేసేవాళ్లు ఉద్యోగులే తప్ప నౌకర్లు కాదు. వాళ్లను గౌరవించాలి. సలహాలు వినాలి. బాగా పని చేస్తే ప్రోత్సహించాలి.

* నైతికత: ఆజ్ఞలివ్వడమే కాదు.. ఆచరించి చూపడం నాయకుడి బాధ్యత. నిబంధనలు, నియమాలు పాటిస్తూ.. నీతి, నిజాయతీగా ఉంటేనే ఇతరుల తప్పులు ఎత్తి చూపే అర్హత ఉంటుంది.

* బాధ్యత: మంచి పేరు వస్తే ఖాతాలో వేసుకోవడం, పనిని ఇతరుల పైకి నెట్టేయడం నాయకుడి లక్షణం కాదు. అవసరమైతే కింది ఉద్యోగులకన్నా అదనంగా పని చేయడానికి సిద్ధంగా ఉండగలగాలి.

* ధైర్యం: సబార్డినేట్స్‌ని ముందుండి నడిపించడమే కాదు.. మీకు నేనున్నా అనే నమ్మకం కలిగించగలగాలి. వాళ్ల ముందు డీలా పడిపోవడం, భయంతో వెనకడుగేయడం, తప్పుల్ని పదేపదే ఎత్తిచూపడం వారి ఆత్మస్థైర్యం సన్నగిల్లేలా చేస్తుంది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని