నయా.. అపాచీ ఆర్‌టీఆర్‌..

నిన్నటిది రేపటికి బోర్‌. యువతకి కొత్తదనం కావాలి. వాళ్ల అభిరుచులకు తగ్గట్టే ఆటోమొబైల్‌ కంపెనీలు ఎప్పటికప్పుడు కొత్త మెరుగులు దిద్దుతూ వాహనాలకు అప్‌డేటెడ్‌ వెర్షన్లు తీసుకొస్తున్నాయి.

Published : 10 Sep 2022 00:40 IST

నిన్నటిది రేపటికి బోర్‌. యువతకి కొత్తదనం కావాలి. వాళ్ల అభిరుచులకు తగ్గట్టే ఆటోమొబైల్‌ కంపెనీలు ఎప్పటికప్పుడు కొత్త మెరుగులు దిద్దుతూ వాహనాలకు అప్‌డేటెడ్‌ వెర్షన్లు తీసుకొస్తున్నాయి. టాప్‌ సెల్లింగ్‌ టీవీఎస్‌ అపాచీ ఆర్‌టీఆర్‌ 160, 180 మోడళ్లకి సైతం అదనపు హంగులు జోడించి 2022 అప్‌డేటెడ్‌ వెర్షన్‌ తీసుకొచ్చారు.

కొత్తగా చేర్చినవి: ఎల్‌ఈడీ హెడ్‌ల్యాంప్‌, ఎల్‌ఈడీ టెయిల్‌ ల్యాంప్‌, గ్రాఫిక్‌ డిజైన్లు. రెండు కేజీల బరువు తగ్గించారు.
నలుపు, తెలుపు, ఎరుపు, నీలం.. రంగుల్లో దొరుకుతున్నాయి

చెప్పుకోదగ్గ ఫీచర్లు: స్మార్ట్‌ఫోన్‌తో అనుసంధానించగల డిజిటల్‌ ఇన్‌స్ట్రుమెంట్‌ క్లస్టర్‌.. రెయిన్‌, అర్బన్‌, స్ట్రీట్‌ అనే మూడు రైడింగ్‌ మోడ్‌లు.
సాంకేతికాంశాలు: 159.7సీసీ ఎయిర్‌కూల్డ్‌ ఇంజిన్‌, 16.04పీఎస్‌ సామర్థ్యం (అపాచీ ఆర్‌టీఆర్‌ 160) 177.4సీసీ ఎయిర్‌కూల్డ్‌ ఇంజిన్‌, 17.02పీఎస్‌ సామర్థ్యం.
ధర రూ.: 1.17లక్షలు (ఎక్స్‌ షోరూం)


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని