‘టెడెక్స్‌’కి ఆహ్వానం!

వివిధ రంగాల్లో విజయం సాధించిన విజేతలు, అనుభవజ్ఞుల స్ఫూర్తిదాయక ప్రసంగాలు.. ఉరిమే ఉత్సాహంతో చెలరేగే యువ తరంగాల మధ్య వాడీవేడీగా సాగే చర్చలు..

Published : 10 Sep 2022 00:40 IST

వివిధ రంగాల్లో విజయం సాధించిన విజేతలు, అనుభవజ్ఞుల స్ఫూర్తిదాయక ప్రసంగాలు.. ఉరిమే ఉత్సాహంతో చెలరేగే యువ తరంగాల మధ్య వాడీవేడీగా సాగే చర్చలు.. అలసిసొలసిన మనసులను రంజింపంజేసేలా వినోద కార్యక్రమాలు.. ‘టెడెక్స్‌ టాక్స్‌’ అంటేనే భిన్న అంశాల ఖజానా. ఈ అనుభవాలు వింటూ, అనుభూతులు ఒడిసిపట్టే మరో అవకాశం రానే వచ్చింది. వార్షికోత్సవంలో భాగంగా.. ‘టెడెక్స్‌ హైదరాబాద్‌’ చాప్టర్‌ ఆధ్వర్యంలో ఈనెల 18న భారీ ఎత్తున కార్యక్రమం నిర్వహించనున్నారు. ఆసక్తి ఉన్న కుర్రకారు ఎవరైనా రిజిస్ట్రేషన్‌ చేసుకోవచ్చు. కార్యక్రమంలో పాల్గొనవచ్చు.
వక్తలు: సాబూ సిరిల్‌ (సినిమా), చిన్నబాబు సుంకవల్లి (వైద్యం), పర్వీందర్‌ సింగ్‌ (సంగీతం), రితేష్‌ భాటియా, (సైబర్‌ క్రైం)లతోపాటు భిన్న రంగాలకు చెందిన 15మంది తమ అనుభవాలు వివరిస్తారు.
వినోదాలు: మ్యూజిక్‌, డ్యాన్స్‌.. ఇతర కార్యక్రమాలు ఉంటాయి.


రిజిస్ట్రేషన్‌, పూర్తి వివరాలకు 
 www.tedxhyderabad.com వెబ్‌సైట్‌లో సంప్రదించవచ్చు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని