Published : 24 Sep 2022 01:56 IST

అదిరే భుజాలు.. దృఢమైన కాళ్లు

దృఢమైన భుజాలు, ఉబికి వచ్చిన కండలే కాదు.. కాలి పిక్కలు, పాదాలు ఫిట్‌గా ఉంటేనే హీమ్యాన్‌ అంటారు. డంబెల్స్‌ వాడుతూ వీటన్నింటినీ సమన్వయం చేసే కొన్ని వ్యాయామాలు సూచిస్తున్నారు ఫిట్‌నెస్‌ గురూలు.

భుజాలకు..

* షోల్డర్‌ ప్రెస్‌: భుజాలు గట్టి పడే వర్కవుట్‌ ఇది. రెండు చేతుల్లో డంబెల్స్‌ పట్టుకొని మోచేతులను సమాంతరంగా చాచుతూ, మడుస్తూ పోవాలి. కూర్చుని, నిల్చొని ఎలాగైనా చేయొచ్చు.

* ఛాతీ లక్ష్యంగా: రెండు చేతుల్లోకి డంబెల్స్‌ తీసుకోవాలి. ఛాతీకి కొంచెం దూరంగా, దగ్గరగా జరుపుతూ కొనసాగించాలి. ఈ వర్కవుట్‌ నిల్చొనే చేయాలి.

* విశాలంగా: డంబెల్స్‌తోపాటు చేతులను దూరంగా చాచుతూ.. కిందికి, పైకి తీసుకొస్తూ కొనసాగించాలి. చేతులు శరీరానికి తాకకూడదు.

* ఫ్రంట్‌ రేజెెస్‌: ప్లేట్‌ డంబెల్‌ లేదా మామూలు డంబెల్‌.. వేటినైనా ఉపయోగించవచ్చు. డంబెల్స్‌ని ఛాతీకి దూరంగా, దగ్గరగా చేస్తుండాలి.

దృఢమైన కాళ్లకి..

* డంబెల్‌ ఫ్రంట్‌ స్క్వాట్‌: డంబెల్స్‌ని భుజాలపై పెట్టుకొని భారమంతా కాళ్లపై పడేలా కూర్చుంటూ, లేస్తూ స్క్వాట్స్‌ చేయాలి.

* స్టెప్‌అప్స్‌: మోకాళ్ల ఎత్తు దాటని చిన్న బల్ల, బాక్స్‌లాంటిది ఏర్పాటు చేసుకోవాలి. చేతుల్లో డంబెల్స్‌ పట్టుకొని భారం కాళ్లపై పడేలా దానిపై కాళ్లని మార్చి మార్చి స్టెప్పులేయాలి.

* బ్రిడ్స్‌ డంబెల్స్‌: వెల్లకిలా పడుకొని చేతుల్లోకి డంబెల్స్‌ తీసుకోవాలి. వాటిని ఉదరానికి కింది భాగంలో పెట్టుకొని, కాళ్ల ఆసరాతో శరీరాన్ని గాల్లోకి లేపాలి. శరీర భారం మెడ, భుజాలపై పడేలా చూసుకోవాలి.

* వాకింగ్‌ లాంజెస్‌: డంబెల్స్‌ చేతుల్లో పట్టుకొని.. కుడికాలు ముందుకి, ఎడమ కాలు వెనక్కి చాచి నడుస్తున్నట్టుగా పెద్ద పెద్ద అంగలు వేస్తూ కాళ్లని మార్చాలి. భారమంతా పాదాలు, పిక్కలు, తొడలపై పడేలా చూసుకోవాలి.

- ఇవన్నీ ఎనిమిది నుంచి పది సార్లు చేస్తుండాలి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని