కుర్ర దూకుడికి.. ఛార్జింగ్‌

ఇంధనం ఖర్చు తక్కువ.. పర్యావరణ హితం ఎక్కువ. బ్యాటరీ బైక్‌ల తీరిది. ప్రభుత్వం పట్టుదలగా ఉండటంతో భవిష్యత్తులో ఇవి జోరందుకోనున్నాయి. ప్రస్తుతం అందుబాటులో ఉన్నవాటిలో స్టైల్‌గా,

Published : 01 Oct 2022 00:46 IST

యువాహనం

ఇంధనం ఖర్చు తక్కువ.. పర్యావరణ హితం ఎక్కువ. బ్యాటరీ బైక్‌ల తీరిది. ప్రభుత్వం పట్టుదలగా ఉండటంతో భవిష్యత్తులో ఇవి జోరందుకోనున్నాయి. ప్రస్తుతం అందుబాటులో ఉన్నవాటిలో స్టైల్‌గా, మంచి పికప్‌తో యువతకి నప్పే కొన్ని ఎలక్ట్రిక్‌ స్కూటర్లు ఇవి.


ఎవోలెట్‌ పోలో పోనీ
స్టైల్‌కి అత్యధిక ప్రాధాన్యం ఇచ్చేవారికి ఇది మంచి ఎంపిక. అత్యధిక వేగం గంటకి 25కి.మీ.లు. లిథియం-అయాన్‌ బ్యాటరీతో పరుగులు తీస్తుంది. ఒక్కసారి ఛార్జ్‌తో 65 కి.మీ.లు వెళ్లొచ్చు. ధర రూ: 50 వేలు


ఉజాస్‌ ఎనర్జీ ఇ-గో
ఫ్యాషన్‌, పర్‌ఫార్మెన్స్‌ కలయిక మా బండి అంటోంది తయారీదారు. ట్యూబ్‌లెస్‌ టైర్లు, రివర్స్‌ డ్రైవ్‌, తాళంచెవి లేకుండా వాడకంలాంటి ప్రత్యేక ఫీచర్లు ఉన్నాయి. ఆరుగంటలు ఛార్జింగ్‌ పెడితే 60కి.మీ.లు వెళ్తుంది. ధర రూ: 35వేలు


ఇండస్‌ యో ఎక్స్‌ప్లోర్‌
అతి తక్కువగా 75 కేజీలు బరువుండే స్కూటర్‌ ఇది. గ్రాఫిక్స్‌ డిజైన్‌తో చూడటానికి స్టైలిష్‌గా ఉంటుంది. కాలేజీ కుర్రకారుకి చక్కగా సరిపోతుంది. ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే 70 కి.మీ.లు వెళ్తుంది. వేగం మాత్రం గంటకి 25 కి.మీ.లకే పరిమితం. ధర రూ: 40వేలు


పలాటినో ఏంజెల్‌
పడుచు అమ్మాయిల కోసం ఈ మోడల్‌ని మలిచినట్టు తెలుస్తోంది. బీఎల్‌డీసీ రకం మోటార్‌తో పని చేస్తుంది. 200 కేజీలకు పైగా బరువు మోయగలదు. డ్రమ్‌ బ్రేక్స్‌, ట్యూబ్‌లెస్‌ టైర్లు ఈ బండి ప్రత్యేకత. ఛార్జింగ్‌ రేంజ్‌ 60 కి.మీ.లు. ధర రూ: 35వేలు


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని