Updated : 02 Nov 2022 10:51 IST

బుల్లిదే.. మోత మోగిస్తుంది

కాలేజీ, క్యాంటీన్‌, మాల్‌, మెట్రో... ఎక్కడున్నా కుర్రకారు చెవుల్లో మ్యూజిక్‌ మోత మోగాల్సిందే. దానికి తగ్గట్టే యువతను మెప్పించేలా కొత్త పరికరం విపణిలోకి వచ్చింది. అదే Audioengine DAC3. ఇది యూఎస్‌బీ కేబుల్‌, యాంప్లిఫయర్‌లా పని చేస్తుంది. పెన్‌డ్రైవ్‌ పరిమాణంలో ఉంటుంది. ఫోన్‌, ట్యాబ్లెట్‌, కంప్యూటర్‌, ల్యాప్‌టాప్‌ నుంచి ఇయర్‌ఫోన్‌, హెడ్‌సెట్‌, స్పీకర్లు.. దేనితో అయినా అనుసంధానం చేసుకోవచ్చు. శబ్దం స్పష్టంగా ఉంటుంది. వాల్యూమ్‌ ఎంతైనా పెంచుకోవచ్చు. రెండు రకాలుగా పనిచేసే ఈ బుల్లి పరికరం సంగీతప్రియులకు చక్కని కానుక అంటోంది తయారీ సంస్థ.
-   ధర రూ. 10,999           


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు