Published : 05 Nov 2022 01:10 IST

వేటాడే ప్రేమ

హాంటింగ్‌’కి అర్థమేంటని ఎవరినైనా అడగండి. ‘ఈమాత్రం తెలియదా? వేటాడమేగా...’ అంటారు వెటకారంగా! అదే ప్రేమలో మునిగితేలే మిలీనియల్‌, జనరేషన్‌ జడ్‌ జంట దగ్గర ఈ విషయం ప్రస్తావిస్తే.. ఇంకోలా జవాబిస్తారు. ఔను బాస్‌.. ప్రేమికుల నిఘంటువులో ఒక్కో పదానికి ప్రత్యేక అర్థాలుంటాయి. నిగూఢార్థాలు దాగి ఉంటాయి. ఇవి ఎప్పటికప్పుడు మారిపోతుంటాయి. తేలికగా చెప్పాలంటే హాంటింగ్‌ అంటే ఆన్‌లైన్‌లో అమ్మాయి లేదా అబ్బాయిని వెంటాడటం. అదీ ప్రేమగానే. ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ పెట్టడం ఆలస్యం.. వాళ్లని ఇష్టపడేవాళ్లు వెంటనే లైక్‌ కొడతారు. దృష్టిలో పడాలని నచ్చేలా కామెంట్‌ చేస్తారు. ఇన్‌స్టాలో ఫొటోకి ప్రేమ గుర్తుల బాణాలు వదులుతారు. వాళ్ల పోస్టులను వాట్సప్‌ స్టేటస్‌లుగా మార్చుకుంటారు. ఇది ఎదుటివాళ్లకు ఇబ్బంది కలుగుతున్నా తమ పంథా మార్చుకోరు. అవతలివాళ్లు ఈ వీరాభిమానులను అన్‌ఫాలో చేసినా, బ్లాక్‌ చేసినా పట్టించుకోరు. ఫేస్‌బుక్‌ పోతే వాట్సప్‌ ఉందిగా, అదీ కుదరకపోతే ఇన్‌స్టా, టెలిగ్రామ్‌, లింక్డ్‌ఇన్‌.. ఇలా రోడ్‌సైడ్‌ రోమియోల్లా వెంబడిస్తూనే ఉంటారు. ఈ అపర ప్రేమికులకు తమ అభిమానం చాటుకోవాలనే ఆతృతే తప్ప.. హాని చేయాలనే ఉద్దేశం ఉండదు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు