Published : 05 Nov 2022 01:11 IST

కుర్రకారూ.. కొంటున్నారా కారు?

క్యాంపస్‌ దాటకుండానే కొలువు సాధించే కుర్రకారు ఈ కాలంలో ఎక్కువే. సంపాదన మొదలయ్యాక వాళ్లు కోరుకునే ఖరీదైన వస్తువుల జాబితాలో తప్పకుండా ఉండేవి ద్విచక్రవాహనాలు, కార్లు. టూవీలర్‌ సరదాని తీర్చుకోవడం తేలికేగానీ కారు సొంతం చేసుకోవడం కొంచెం ఖరీదైన వ్యవహారమే. అందుకే ఈ పంచకల్యాణి కొనుగోలులో తీసుకోవాల్సిన జాగ్రత్తలివి.
* బడ్జెట్‌: కారు అసలు ధర ఎక్స్‌షోరూం ధరపై కనీసం పదిహేను శాతం అధికంగా ఉంటుంది. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. రిజిస్ట్రేషన్‌ రుసుం, రోడ్డు టాక్సు, బీమా, కాలుష్య ధ్రువపత్రం, అదనపు యాక్సెసరీలు.. ఇవన్నీ ఉంటాయని తెలుసుకున్నాకే మీ బడ్జెట్‌ ఎంతో లెక్కలు వేసుకోవాలి.

* రుణం: కారుకి రుణమిచ్చే సంస్థలు బోలెడు. వడ్డీ ఒకట్రెండు శాతం తగ్గినా కట్టాల్సిన ఈఎంఐ గణనీయంగా తగ్గుతుంది. అందుకే నాలుగైదు చోట్లయినా తిరిగి.. మొహమాటం లేకుండా బేరమాడి వడ్డీ శాతం తక్కువ ఉండేలా చూసుకోవాలి.
* ఎంపిక: మన రోజువారీ వాడకం, అవసరం, ప్రయాణించే దూరం ఆధారంగా కారు ఎంపిక ఉండాలి. బ్యాచిలర్‌, చిన్న కుటుంబానికి హ్యాచ్‌బ్యాక్‌లు సరిపోతాయి. పెద్ద కుటుంబాలైతే సెడాన్‌, ఎస్‌యూవీలు ప్రయత్నించవచ్చు. అభిరుచి, ఇంధనం లభ్యతకి అనుగుణంగా పెట్రోల్‌, డీజిల్‌, సీఎన్‌జీ, హైబ్రిడ్‌, బ్యాటరీ.. ఏదైనా ఎంచుకోవచ్చు.
* రీసేల్‌: కొన్నాళ్లు వాడిన తర్వాత వేరే కారు తీసుకునే ఉద్దేశం ఉంటే మంచి రీసేల్‌ ఉన్న మోడళ్లనే ఎంచుకోవాలి. అత్యధికంగా అమ్ముడయ్యేవి, సర్వీస్‌ సెంటర్లు అన్నిచోట్లా అందుబాటులో ఉన్నవాటికే మంచి ధర ఉంటుంది.
* భద్రత: కారు కొనేముందు తప్పకుండా గమనించాల్సింది భద్రతా ఫీచర్లు. యాంటీలాక్‌ బ్రేకింగ్‌ సిస్టమ్‌, ఎయిర్‌బ్యాగుల్లాంటి సెక్యూరిటీ రేటింగ్స్‌లో ముందున్న కారే ఎంచుకుంటే మంచిది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు