బోర్‌.. ఇలా పరార్‌!

‘అరే మామా... బోర్‌ కొడుతుందిరా.. ఏదైనా మూవీకెళ్దామా?’, ‘ఈ రోజు పనేం చేయాలనిపించడం లేదు డియర్‌.. ఏవైనా కబుర్లు చెప్పు’ ఇలాంటి సందర్భాలు ప్రతి ఒక్కరి జీవితంలో ఉంటాయి.

Updated : 03 Dec 2022 03:16 IST

‘అరే మామా... బోర్‌ కొడుతుందిరా.. ఏదైనా మూవీకెళ్దామా?’, ‘ఈ రోజు పనేం చేయాలనిపించడం లేదు డియర్‌.. ఏవైనా కబుర్లు చెప్పు’ ఇలాంటి సందర్భాలు ప్రతి ఒక్కరి జీవితంలో ఉంటాయి. ఇంతకీ ఈ బోర్‌డమ్‌ వెనక ఉన్న మతలబు ఏంటో తెలుసుకుంటే.. ఆ పదానికి చోటు ఉండదండోయ్‌. శరీరానికి తగినంత విశ్రాంతి లేకపోవడం, పోషకాహార లోపం, మానసిక అసమతౌల్యం, సుదీర్ఘకాలంగా ఒకే పని చేయడం.. వీటివల్లే బోర్‌డమ్‌ అనే భావన కలుగుతుందంటారు వైద్య నిపుణులు. చేస్తున్న పనిపై ఆసక్తి లేకపోవడం, అసంతృప్తిగా ఉండటం, ఏకాగ్రత కుదరకపోవడమూ ఆ బాపతే. ఈ సమయంలో బుర్ర ఖాళీగా ఉంటుంది. మనసులో ఎలాంటి ఫీలింగ్స్‌ ఉండవు. ఏదో తెలియని అసౌకర్యం.. ఇది ముదిరితే మానసికంగా కుంగిపోతారట. మరి బోర్‌డమ్‌ని పారదోలాలంటే ఏం చేయాలి?
* చేయాల్సిన పనుల జాబితా రాసుకొని ఒక్కొక్కటిగా చేయడం.
* బైక్‌, కారు, ఇల్లు శుభ్రం చేయడంలాంటి చిన్నచిన్న పనులు చేయడం.
* వెరైటీగా ఓ కొత్త వంట తయారు చేయడం.
* ఎక్కువ సమయం బోర్‌ కొడుతుంటే.. ఏదైనా స్వచ్ఛంద సంస్థ తరపున పని చేయడం.
* చిన్ననాటి స్నేహితులతో మాట కలపడం.. మనసు విప్పడం.
* మంచి పుస్తకం చదవడం, తోట పని, జిమ్‌కెళ్లడం.
* ఏదైనా ఆన్‌లైన్‌ క్లాసులో చేరడం.
* స్నేహితుల పుట్టినరోజులు, ప్రత్యేక సందర్భాలకు చిన్నచిన్న బహుమతులు తయారు చేయడం.
* కొత్త భాష నేర్చుకోవడం.
* ఒక్కసారి మనసు పెట్టి ఆలోచించండి బాస్‌. బోర్‌డమ్‌ని పారదోలే ఆలోచనలెన్నో వస్తాయి. అవి సమయాన్ని తినేసే వ్యర్థ వ్యాపకాలు కాకూడదనేది షరతు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని