Samantha: నచ్చినట్టే ఉందాం..

నాకు కోపం వచ్చినప్పుడల్లా జిమ్‌కి వెళ్లిపోతా. పిచ్చిపిచ్చిగా కసరత్తులు చేస్తా. వెంటనే కోపం చల్లారిపోతుంది. ఉద్రేకం విచక్షణ కోల్పోయేలా చేస్తుంది.

Updated : 17 Dec 2022 09:27 IST

స్ఫూర్తి పాఠం

* నాకు కోపం వచ్చినప్పుడల్లా జిమ్‌కి వెళ్లిపోతా. పిచ్చిపిచ్చిగా కసరత్తులు చేస్తా. వెంటనే కోపం చల్లారిపోతుంది. ఉద్రేకం విచక్షణ కోల్పోయేలా చేస్తుంది.

* డబ్బు, పేరు కోసం అర్రులు చాచను. నటనే నాకు ముఖ్యం. ప్రతి పాత్రనీ ప్రేమిస్తా. చేసే పనిని ప్రేమించ లేనప్పుడు దాంతో ఎలాంటి సంతోషం, ప్రయోజనం ఉండవు.

* నాకు నేనే పెద్ద విమర్శకురాలిని. మన తప్పుల్ని మనం తెలుసుకున్నప్పుడే కెరియర్‌లో రాణిస్తాం.

* కాలం అనుకూలించనప్పుడు.. మనకు ఏదీ వర్కవుట్‌ కాదు. ఆ సమయంలో బాధ పడుతూ కూర్చోను. ఆలోచించడం మానేసి నిద్రపోతా.

* నీకు నచ్చినట్టుగానే నువ్వు ఉండు. నువ్వు ఈ భూమ్మీదకు వచ్చింది ఇతరులను మెప్పించడానికి, సంతోషపెట్టడానికి కాదు.

* మనకు ఉన్నవాటినే మనం ఇష్టపడటం మొదలుపెడితే.. అవసరం ఉన్నవన్నీ మనల్ని వెతుక్కుంటూ వస్తాయి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని