Updated : 07 Jan 2023 02:13 IST

మేమో రకం

కొందరు కుర్రాళ్లు మరీ సినీజీవులు. అస్తమానం ఆ కబుర్లతోనే, ఆ లోకంలోనే విహరిస్తుంటారు. వాళ్లెలా ఉంటారో.. సరదాగా..

* సిలబస్‌ ఎంతవరకు వచ్చిందో తెలియదుగానీ ఏ సినిమా షూటింగ్‌ ఎంతవరకు వచ్చిందో ఇట్టే చెప్పగలం.

*  ఫిజిక్స్‌ ఫార్ములాలు గుర్తుండవుగానీ.. అభిమాన హీరో చిత్రాల బడ్జెట్‌, వసూళ్ల లెక్కలు మాకు కొట్టిన పిండే.

*  పేరెంట్స్‌ ఆస్తులు, అప్పులు తెలియకపోయినా.. నచ్చిన కథానాయకుడి సంపాదన ఎంతో అణా పైసలతో సహా లెక్కగట్టగలం.

*  మనల్ని ఎవరైనా తిడితే గొడవ ఎందుకులే అనుకుంటాంగానీ.. మా హీరోని తిడితే మాత్రం వాడి తాట తీస్తాం.

*  మా ఫ్యూచర్‌ ప్లాన్స్‌ గురించి పెద్దగా ఆలోచించం గానీ.. మా సెలెబ్రెటీ సినిమా ఆడకపోతే.. తెగ బెంగ పెట్టుకుంటాం.

అభితేజ్‌రెడ్డి, హైదరాబాద్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు