ఒప్పంద బంధాలు.. లవ్‌ బాంబింగ్‌లు!

ప్రేమ.. పెళ్లి.. రిలేషన్‌షిప్‌.. డేటింగ్‌.. ఈ పదాల్ని పలవరించకుండా యువతకి రోజు గడవదు. ఈమధ్య కాలంలో కుర్రకారు నోళ్లలో బాగా నానుతున్న కొత్త డేటింగ్‌ ట్రెండ్‌లపై ఓ లుక్కేద్దాం.

Updated : 07 Jan 2023 02:10 IST

ప్రేమ.. పెళ్లి.. రిలేషన్‌షిప్‌.. డేటింగ్‌.. ఈ పదాల్ని పలవరించకుండా యువతకి రోజు గడవదు. ఈమధ్య కాలంలో కుర్రకారు నోళ్లలో బాగా నానుతున్న కొత్త డేటింగ్‌ ట్రెండ్‌లపై ఓ లుక్కేద్దాం.

సిట్యుయేషన్‌షిప్‌: ఈ ఏడాది కుర్రకారు నోళ్లలో బాగా నానిన పదం ఇది. ఇందులో ప్రేమ ఉంటుంది.. ప్రణయం ఉంటుంది.. కానీ అది జీవితాంతం ఉండదు. సందర్భానికి తగ్గట్టు కొన్ని నెలల్లో లేదా ఏళ్లలో ముగిసిపోతుంది. అమ్మాయి, అబ్బాయి ఇద్దరూ ఒప్పుకుంటేనే.. ఈ ఒప్పంద బంధం ముందుకెళ్తుంది.

ఘోస్టింగ్‌: ఇది అచ్చమైన ఆన్‌లైన్‌ డేటింగ్‌. డేటింగ్‌ యాప్‌లు తీసుకొచ్చిన ధోరణి. ఇందులో రొమాన్స్‌కే పెద్దపీట. మనసు ఇచ్చిపుచ్చుకోవడాలు ఉండవు. కుటుంబంతో కలుసుకోవడాల్లేవు. సామాజిక మాధ్యమాల్లో స్నేహితులు కారు. డేటింగ్‌ యాప్‌లో పరిచయం అవుతారు. మురిపెం తీరగానే ‘అంతా తూచ్‌’ అంటూ కను మరుగవుతారు.

డ్రై డేటింగ్‌: వీలైతే నాలుగు మాటలు.. కుదిరితే ఓ ముద్దు.. ఇంకాస్త ముందుకెళ్తే రొమాన్స్‌.. డేటింగ్‌ అన్నాక ఇవన్నీ ఉంటాయి. కానీ డ్రై డేటింగ్‌లో ఇవి మచ్చుకైనా కనిపించవు. అభిప్రాయాలు తెలుసుకోవడం, అర్థవంతంగా మాట్లాడుకోవడం.. అంతే. రొమాంటిక్‌ భావనలు ఇద్దరి మధ్యా అస్సలు ఉండవు. ఈ ఏడాది టాప్‌ ట్రెండ్‌లలో ఇదొకటి.

లవ్‌ బాంబింగ్‌: మొదటి పరిచయంలోనే అన్ని వ్యక్తిగత వివరాలు పంచుకుంటారు. కొన్నాళ్లు గడవగానే ‘లవ్యూ’, ‘లవ్యూ టూ’ అనుకుంటారు. బహుమతులు ఇచ్చిపుచ్చుకుంటారు. ప్రణయాన్ని పరవళ్లు తొక్కిస్తారు. తర్వాత ఏదైనా తేడా రాగానే గప్‌చుప్‌గా ‘బ్రేకప్‌’ చెప్పేసుకుంటారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని