కుర్ర నేస్తం.. అమ్మకాలు ఘనం

మేటి పికప్‌.. ఎలాంటి దారుల్లో అయినా దూసుకెళ్తే సత్తా.. స్పోర్ట్స్‌ యుటిలిటీ వాహనాల సొంతం. అందుకే ఇవి కుర్రకారుకి ప్రియనేస్తాలు.

Published : 14 Jan 2023 00:28 IST

మేటి పికప్‌.. ఎలాంటి దారుల్లో అయినా దూసుకెళ్తే సత్తా.. స్పోర్ట్స్‌ యుటిలిటీ వాహనాల సొంతం. అందుకే ఇవి కుర్రకారుకి ప్రియనేస్తాలు.  గతేడాది అత్యధికంగా అమ్ముడైన ఎస్‌యూవీ టాటా నెక్సాన్‌. ఏంటి దీని ప్రత్యేకత అంటే..
ఇంజిన్‌: పెట్రోల్‌, డీజిల్‌ రెండు రకాల్లో అందుబాటులో ఉంది. పెట్రోల్‌ వేరియంట్‌ 1.2లీటర్ల టర్బోఛార్జ్‌డ్‌, 118 బీహెచ్‌పీ సామర్థ్యంతో పని చేస్తుంది. డీజిల్‌ రకం 1.5లీటర్ల టర్బోఛార్జ్‌డ్‌ ఇంజిన్‌ 108బీహెచ్‌పీ సామర్థ్యంతో దూసుకెళ్తుంది.
ప్రత్యేకతలు: నాలుగు మీటర్ల లోపు విభాగంలో 5 స్టార్‌ రేటింగ్‌ భద్రతా ప్రమాణాలు ఉన్న అతి కొద్ది కార్లలో ఇదొకటి. మల్టిపుల్‌ ఎయిర్‌బ్యాగ్‌లు, యాంటీ లాక్‌ బ్రేకింగ్‌ సిస్టమ్‌, రివర్స్‌ పార్కింగ్‌ సెన్సర్లు, కెమెరాలున్నాయి. ఎకో, సిటీ, స్పోర్ట్‌ అనే మూడురకాల డ్రైవింగ్‌ మోడ్‌లతో దూసుకెళ్తుంది.
మైలేజీ: 21.10కి.మీ./లీ (డీజిల్‌)
17.57కి.మీ./లీ (పెట్రోల్‌)
అత్యధిక వేగం: 162కి.మీ./గం
ధర రూ.7.69లక్షలు (ఎక్స్‌షోరూం)


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని