బ్రహ్మరాక్షసికి బ్రహ్మచారి వెరైటీ ప్రేమ లేఖ
తిరుపతి బ్రహ్మోత్సవాల్లో ఆ దేవదేవుని రూపం చూద్దామని నేను వెళ్లినప్పుడు అడగక ముందే వరమిచ్చిన దేవతలా నువ్వు దర్శనం ఇచ్చావు. ఆ బ్రహ్మే నిన్ను నాకోసం పంపించాడని ఆ క్షణం మురిసిపోయా. నిన్నెలాగైనా ఒప్పించి.. ఓ మంచి ముహూర్తం చూసి నీకు బ్రహ్మ ముడి వేయాలనుకున్నా. నువ్వేమో నా ఇష్టాన్ని ఛీత్కారంగా చూసి చీదరించుకున్నావు. నువ్వు నా పక్కనుంటేనే నా బతుకు బ్రహ్మాండంగా ఉంటుందని అప్పటికే ఫిక్సైన నేను.. నీ మనసు గెల్చుకోవాలని ఎన్నో బ్రహ్మవిద్యలు ప్రదర్శించా. బ్రహ్మాస్త్రాలు ప్రయోగించా. అయినా బ్రహ్మచెవుడు ఉన్న అమ్మాయిలా.. నా మొర ఆలకించడమే లేదు. ఆ బ్రహ్మ దిగి వచ్చినా నీకు దక్కేదే లేదంటూ భీష్మించుకొని కూర్చున్నావు. కానీ ఇప్పటికే నా మనసంతా నిండిన నిన్ను నేను వదులుకునే ప్రసక్తే లేదు. ఎన్ని కష్టాలు పడైనా నిన్ను నా దానిగా చేసుకుంటా. ఒకవేళ నువ్వు మనసు మార్చుకొని నన్ను కరుణిస్తే.. నీ ప్రేమకి బ్రహ్మరథం పడతా. ఎంత చేసినా కఠిన పాషాణంలా ఉంటానంటే.. ఆ బ్రహ్మ రాసిన తలరాతను ఎవరూ మార్చలేరనుకుంటూ నా బతుకింతే అనుకుంటా. ఆ బాధను దిగమింగుకోవడానికి బ్రహ్మానందం వీడియోలు చూస్తూ.. జీవితాంతం బ్రహ్మచారిగానే మిగిలిపోతా.
పంపినవారు: నల్లపాటి సురేంద్ర, అచ్యుతాపురం
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Politics News
కోటి మంది మహిళా లబ్ధిదారులతో సెల్ఫీ.. సాధినేని యామిని శర్మ
-
India News
India Summons UK Official: లండన్లో ఖలిస్థాన్ అనుకూలవాదుల దుశ్చర్య.. బ్రిటన్ దౌత్యవేత్తకు సమన్లు
-
India News
ఒక్క రోజే 1,071 కొవిడ్ కేసులు.. దేశంలో మళ్లీ పెరుగుదల
-
World News
28 ఏళ్లకే 9 మందికి జన్మ.. సామాజిక మాధ్యమాల్లో వైరల్
-
Ts-top-news News
వరి పొలంలో భారీ మొసలి
-
Movies News
రమ్యకృష్ణపై సన్నివేశాలు తీస్తున్నప్పుడు కన్నీళ్లొచ్చాయి