గుండెలపై టాటూ.. వేయించుకుంటేనే ప్రేమా?
మనలో మనం
ఆన్‌లైన్‌లో ఒకమ్మాయితో పరిచయం ప్రేమగా మారింది. కొన్నాళ్ల దాకా మా ప్రయాణం సాఫీగానే సాగింది. కానీ ఈమధ్యే తను వింతగా ప్రవర్తిస్తోంది. అందరూ చూస్తుండగా మోకాలిపై నిల్చొని గులాబీ ఇవ్వమంటోంది. గుండెలపై ఆమె పేరు టాటూ వేయించుకోవాలట. ఓసారైతే అర్ధరాత్రి కాల్ చేసి గోడ దూకి ఇంట్లోకి రమ్మంది. నాకు ఇలాంటివి నచ్చవు అన్నా వినడం లేదు. తనకి నేనంటే విపరీతమైన ప్రేమ. అందులో సందేహం లేదు. కానీ తన పద్ధతి మారేదెలా?
ఎస్.రాకేశ్, ఈమెయిల్
మీరు చెప్పిన వివరాల ప్రకారం తను ఒక ఊహా ప్రపంచంలో బతుకుతున్నట్టుగా అర్థమవుతోంది. ప్రేమికులు అన్నాక బహుమతులు ఇచ్చిపుచ్చుకోవడం, సర్‌ప్రైజ్ చేసుకోవడం సహజమేగానీ.. ఇలా అర్ధరాత్రులు గోడ దూకడం, టాటూలు వేయించు కోవడానికిదేం సినిమా కాదు. ఒక్క ఈ విషయంలోనేనా.. లేక అన్నింట్లోనూ ఇలాగే ప్రవర్తిస్తుందా గమనించండి. దీనిక్కారణం వయసా? సినిమాలా? స్నేహితులా? ఆరా తీయండి. తను ఇతరుల కారణంగా ప్రభావితం అయితే కొన్ని మాటలు, పద్ధతుల ద్వారా ఆమెని మార్చే అవకాశం ఉంటుంది. తన తీరే అంత అయితే మానసిక నిపుణుల కౌన్సెలింగ్ అత్యవసరం. వాస్తవాలకు దూరంగా తను అలా ఆలోచించడం సమంజసం కాదు. తను మిమ్మల్ని ఎంత ప్రేమించినా ఇలాంటి మనస్తత్వం ఉంటే ఇద్దరూ జీవితాంతం ఇబ్బంది పడతారు. ఇంకా ఆ అమ్మాయి మిమ్మల్ని బాగా ప్రేమిస్తోంది అంటున్నారు. దేనిని దృష్టిలో పెట్టుకొని ఈ నిర్ణయానికి వచ్చారు? సరదాలు, సంతోషాలు పంచుకోవడమే కాదు.. నిజమైన ప్రేమలో బాధ్యతలు, బాధలు షేర్ చేసుకోవడమూ ఉంటుంది. అలాంటి ఏవైనా గడ్డు పరిస్థితుల్లో తను మీకు అండగా నిలబడిందా? ఆలోచించుకోండి. అయినా తనని మీరు వదులుకోవడం ఇష్టం లేకపోతే కౌన్సెలింగ్ ఇప్పించి, ఆమె ఆలోచనా దృక్పథాన్ని మార్చండి. ఆల్ ది బెస్ట్.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Sports News
Jasprit Bumrah: సర్జరీ తర్వాత ముంబయి ఇండియన్స్ ఆటగాళ్లతో జస్ప్రీత్ బుమ్రా సందడి
-
India News
China: అరుణాచల్‌ప్రదేశ్‌లో జీ-20 సమావేశం.. చైనా డుమ్మా..!
-
General News
TSRTC: టీఎస్ఆర్టీసీ ఉచిత వై-ఫై ఏసీ స్లీపర్ బస్సులు ప్రారంభం..
-
World News
America : అమెరికాలోని గురుద్వారాలో కాల్పులు.. ఇద్దరికి తీవ్రగాయాలు..
-
General News
TSPSC: పేపర్ లీకేజీ కేసు.. రెండో రోజు కొనసాగనున్న సిట్ విచారణ
-
Movies News
Ram Charan: అప్పుడు వణికిపోయాడు.. ఇప్పుడు ఉప్పొంగిపోయేలా చేశాడు.. చరణ్ ప్రయాణమిది