యమ హాట్‌ డిజైన్‌తో..

కుర్రకారుని ఆకట్టుకోవడానికి మరిన్ని మెరుగులద్దుకొని విపణిలోకి వచ్చేసింది యమహా ఎఫ్‌జడ్‌ఎస్‌-ఎఫ్‌ఐ వీ4.

Published : 18 Feb 2023 00:18 IST

కుర్రకారుని ఆకట్టుకోవడానికి మరిన్ని మెరుగులద్దుకొని విపణిలోకి వచ్చేసింది యమహా ఎఫ్‌జడ్‌ఎస్‌-ఎఫ్‌ఐ వీ4. స్టైలిష్‌ డిజైన్‌, మేటి పికప్‌ దీని సొంతం. కొత్తగా మరేం వచ్చి చేరాయంటే..

డిజైన్‌: ఎల్‌ఈడీ డీఆర్‌ఎల్‌లతో కూడిన మస్క్యులర్‌ లుకింగ్‌ హెడ్‌లైట్‌, రంగులతో కూడిన చక్రాలు, త్రీడీ ఎంబ్లెమ్‌, 136కేజీల తేలికైన బాడీ దీని సొంతం.
ఇంజిన్‌: 12.2బీహెచ్‌పీ సామర్థ్యం, 13.3ఎన్‌ఎం టార్క్‌, 5స్పీడ్‌ గేర్‌బాక్స్‌తో పని చేస్తుంది.
ఫీచర్లు: యాంటీ లాక్‌ బ్రేకింగ్‌ సిస్టమ్‌, ట్రాక్షన్‌ కంట్రోల్‌, ఎల్‌సీడీ ఇన్‌స్ట్రుమెంట్‌ కంట్రోల్‌, స్పీడోమీటర్‌, ఓడోమీటర్‌, ట్రిప్‌మీటర్‌, స్మార్ట్‌ఫోన్‌ కనెక్టివిటీలాంటివి ఉన్నాయి. మెటాలిక్‌ గ్రే, మెజెస్టీ రెడ్‌, మెటాలిక్‌ బ్లాక్‌ రంగుల్లో లభిస్తోంది. 
ధర: రూ.1.27లక్షలు


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు