వాట్సప్‌లో..చాట్‌జీపీటీ రాయబారి

ఏదో అర్జెంట్‌ పనిలో ఉంటాం. అవతలివైపు నచ్చిన నెచ్చెలి వాట్సప్‌లో సందేశం పంపుతుంది. సమయానికి రిప్లై ఇవ్వలేకపోతాం.

Published : 25 Feb 2023 01:02 IST

ఏదో అర్జెంట్‌ పనిలో ఉంటాం. అవతలివైపు నచ్చిన నెచ్చెలి వాట్సప్‌లో సందేశం పంపుతుంది. సమయానికి రిప్లై ఇవ్వలేకపోతాం. తర్వాతేమవుతుంది? అలకలు, గిల్లికజ్జాలు. మరో గ్రూపులో స్నేహితుడు అత్యవసర మెసేజ్‌ పంపిస్తాడు. చూసుకోకపోతే పెద్ద చిక్కే వచ్చిపడుతుంది. ఇలాంటి సమయాల్లో మన తరపున సమాధానం ఇచ్చేవాళ్లుంటే బాగుండు అనిపిస్తుంది. చాట్‌జీపీటీ అదే చేస్తుంది. ఈ కృత్రిమ మేధ... ఈమధ్యకాలంలో పెద్ద సంచలనంగా మారిన సంగతి అందరికీ తెలిసిందే! ప్రేమలేఖలు, సాఫ్ట్‌వేర్‌ కోడింగ్‌లు రాయడం నుంచి అన్నిరకాల సందేహాల దాకా.. అడిగిందే ఆలస్యం.. సమగ్రంగా సమాధానమిచ్చే చాట్‌జీపీటీ ఇప్పుడు వాట్సప్‌లోనూ అవతలివాళ్లకు రిప్లై ఇస్తుంది. అయితే వాట్సప్‌ అధికారికంగా చాట్‌జీపీట్‌ని సపోర్ట్‌ చేయడం లేదు. GitHub ఇంటిగ్రేట్‌ చేసుకోవడం ద్వారా ఈ సదుపాయం పొందొచ్చు. డేనియల్‌ గ్రాస్‌ అనే ప్రోగ్రామర్‌ పైథాన్‌ స్క్రిప్ట్‌ ద్వారా ఈ రెండింటినీ అనుసంధానించాడు. github. com/danielgross/whatsapp-gpt  ఇదిగోండి లింక్‌. మీరూ ప్రయత్నించండి.


 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని