వయస్సునామీలో మీరెక్కడ?

సరదాలు, స్నేహాలు, సినిమాలు.. అన్నీ కళాశాల కాంపౌండ్‌ వరకే. క్యాంపస్‌ నుంచి కాలు బయటపెట్టగానే కుర్రకారు కథే మారిపోతుంది. కెరియర్‌ పరుగు మొదలవుతుంది.

Published : 11 Mar 2023 00:23 IST

సరదాలు, స్నేహాలు, సినిమాలు.. అన్నీ కళాశాల కాంపౌండ్‌ వరకే. క్యాంపస్‌ నుంచి కాలు బయటపెట్టగానే కుర్రకారు కథే మారిపోతుంది. కెరియర్‌ పరుగు మొదలవుతుంది. సంపద, పరపతి పెంచుకోవాలనే తాపత్రయం షురూ అవుతుంది. ఒక అధ్యయన సంస్థ యువత కెరియర్‌పరంగా ఏ వయసులో ఎక్కడుండాలో చెబుతోంది.


వయసు: 25

పాతికేళ్లు వచ్చేసరికి ఒక ఉద్యోగానికి సరిపోయే విద్యార్హతలు సంపాదించాలి. నైపుణ్యాలు అలవరచుకోవాలి. ఎంచుకున్న రంగంలో ఏదైనా ఒక ప్రత్యేకమైన కోర్సు పూర్తి చేయాలి. ఆపై అమ్మాయిలు, అబ్బాయిలు తామేం కావాలో స్పష్టమైన లక్ష్యాలు ఎంచుకొని ఉండాలి. కొలువులు కొల్లగొట్టే కార్యాలయాలు.. ఉపాధి కార్ఖానాల వివరాలు సేకరించి ఉంచుకోవాలి.


వయసు: 35

ఈ వయసు వచ్చేసరికే వ్యక్తిగతంగా, వృత్తిపరంగా కొన్ని మైలురాళ్లు దాటేసి ఉండాలి. కెరియర్‌ పరంగా చూస్తే.. ఒక బృందనాయకుడిగా సత్తా చాటుకోవాలి. అవసరమైతే కొలువులు మారుతూ కెరియర్‌ నిచ్చెనలు ఎగబాకడానికి సిద్ధంగా ఉండాలి. సీనియర్‌గా.. జూనియర్లకు విలువైన సూచనలు ఇస్తూ మార్గదర్శకులుగా నిలవాలి.


వయసు: 45

అలుపెరగని పనితో.. బృంద వ్యూహాలు రచిస్తూ.. మార్గదర్శకత్వం వహిస్తూ.. అపార అనుభవం మూటగట్టుకున్న మీరు.. ఈ వయసులో ఏదైనా విషయంపై నైపుణ్యం సంపాదించే స్థాయికి చేరుకోవాలి. ఆ రంగంలో నిపుణుడిగా ఎదిగి ఎవరైనా మీ సలహాలు, సూచనలు తీసుకునే స్థాయికి చేరుకోవాలి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని