రంగుల కీబోర్డు

కంప్యూటర్‌, కుర్రకారుది విడదీయలేని బంధం! అందులోనూ మంచి ఫీచర్లతో పాటు స్టైలిష్‌గా ఉండే పీసీలనే ఇష్టపడుతుంటారు యూత్‌.

Published : 25 Mar 2023 00:09 IST

కంప్యూటర్‌, కుర్రకారుది విడదీయలేని బంధం! అందులోనూ మంచి ఫీచర్లతో పాటు స్టైలిష్‌గా ఉండే పీసీలనే ఇష్టపడుతుంటారు యూత్‌. ఆ ఇష్టానికి తగ్గట్టుగా ఎప్పటికప్పుడు వాళ్లని ఆకట్టుకునే ఉత్పత్తులు విపణిలోకి తీసుకొస్తుంటాయి కంపెనీలు. అందులో ఒకటి తాజాగా వచ్చిన The G.Skill KM250 RGB 65% Keyboard. టైపింగ్‌ చేస్తున్నప్పుడు టైపింగ్‌కి అనుగుణంగా రంగురంగుల వెలుగులు విరజిమ్మడం ఈ కీబోర్డు ప్రత్యేకత. ఆర్‌జీబీ లైట్‌నింగ్‌ సిస్టమ్‌తో పని చేస్తుంది. ఎలాంటి డెస్క్‌టాప్‌తో అయినా అనుసంధానం చేసుకోవచ్చు. ప్రొఫెషనల్స్‌, గేమర్లకు అనుకూలంగా ఉంటుందంటోంది కంపెనీ.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు